నాకు క్యాన్సర్.. చుట్టూ డాక్టర్లు.. అప్పుడే సినిమా ఛాన్స్ వచ్చింది.. నటి!

ప్రముఖ నటి మహిమ చౌదరి క్యాన్సర్ బారిన పడి చికిత్స తీసుకుంది అని నటుడు అనుపమ్ ఖేర్ వెల్లడించారు.ఈ సందర్భంగా ఒక వీడియో ని షేర్ చేస్తూ ఈ విధంగా రాసుకొచ్చారు.

 Anupam Kher Shares Mahima Chaudhary Courageous Battle Breast Cancer Details, Ma-TeluguStop.com

తన 525వ చిత్రం ద సిగ్నేచర్ సినిమాలో ఒక కీ రోల్ కోసం మహిమ ను సంప్రదించగా అప్పటికే ఆమె బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు తెలిసిందట.ఇదే విషయాన్ని బయటకు వెల్లడించడంలో తాను కూడా ఒక భాగం కావాలని ఆమె కోరుకున్నట్లు అతను తన ఇంస్టాగ్రామ్ లో వీడియోను షేర్ చేశాడు.

ఆ వీడియోలో మహిమ క్యాన్సర్ వ్యాధితో తాను చేసిన పోరాటం గురించి వివరిస్తూ భావోద్వేగానికి లోనయింది.

మీ 525 సినిమాలో నటించాలని మీరు కాల్ చేసినప్పుడు నేను హాస్పిటల్ బెడ్ పై ఉన్నాను.

నా చుట్టూ డాక్టర్లు నర్సులు ఉన్నారు.అప్పుడు నా జుట్టు పూర్తిగా పోయింది.

ఆ సమయంలో నేను మీరు ఇప్పుడు కాల్ చేశారు ఏంటి అని అనుకున్నాను.మీతో పాటుగా ఇంకా వెబ్ సిరీస్ లలో సినిమాల్లో నటించాలని నాకు ఎన్నో ఫోన్ కాల్స్ వచ్చాయి కానీ నటిస్తానని చెప్పలేను ఎందుకంటే నా హైయిర్ మొత్తం లాస్ అయింది అని చెప్పుకొచ్చింది మహిమ.

అయితే మామూలు చెకప్ కోసం అని వెళ్ళినప్పుడు క్యాన్సర్ వ్యాధి బయటపడిందని, అయితే ఆ వ్యాధి ఉంది అని బయటపడక ముందు వరకూ తనకు ఎలాంటి లక్షణాలు కూడా లేవని, కాకపోతే క్లారిటీ కోసం చెకప్ కి వెళ్లగా డాక్టర్లు అలా చెప్పడం తో విని షాక్ అయ్యాను అని చెప్పుకొచ్చింది.

ఇక డాక్టర్లు చెకప్ చేసి అది క్యాన్సర్ కణతి అని, దానిని మీరు తీసేయాలి అనుకుంటున్నారా అని డాక్టర్లు అడిగారట.అప్పుడు ఆమె వద్దు జస్ట్ చెకప్ కోసం వచ్చాను అని చెప్పగా అలా చివరకు బయాప్సీ చేసి ఆ కణతి తీసి టెస్ట్ చేయగా క్యాన్సర్ గా తేలిందని అనంతరం కీమో లు ఇస్తున్న సమయంలో చాలా నీరసించి పోయి, ఎనర్జీ మొత్తం పోయి నా హెయిర్ మొత్తం ఊసిపోయింది అని చెప్పుకొచ్చింది మహిమ చౌదరి. కాగా ప్రస్తుతం తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని తెలిపింది మహిమచౌదరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube