ఇటీవల రోజుల్లో మధుమేహం, గుండెపోటు, ఊబకాయం, రక్తపోటు( Blood Pressure ), క్యాన్సర్ ఇలా ఎన్నో జబ్బులు మనిషిని పీల్చి పిప్పి చేస్తున్నాయి.వీటికి దూరంగా ఉండాలి అంటే కచ్చితంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి.
పోషకాలతో కూడిన ఆహారాన్ని డైట్ లో చేర్చుకోవాలి.నిత్యం వ్యాయామం, యోగా వంటివి చేస్తుండాలి.
కంటి నిండా నిద్ర ఉండేలా చూసుకోవాలి.అలాగే చాలా మంది తమ రోజును టీ లేదా కాఫీతో ప్రారంభిస్తుంటారు.
కానీ, ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ వాటర్ తో మీ డేను ప్రారంభిస్తే ఎన్నో జబ్బులకు దూరంగా ఉండవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ మ్యాజికల్ వాటర్ ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాసు వాటర్ వేసుకోవాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు క్యారెట్ తురుము, హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చి పసుపు కొమ్ము తురుము వేసుకోవాలి.అలాగే ఒక ఉసిరికాయ( gooseberry ) తీసుకుని గింజ తొలగించి ముక్కలుగా కట్ చేసి వాటర్ లో వేసుకోవాలి.చివరిగా చిటికెడు కుంకుమ పువ్వు వేసి వాటర్ ను బాగా మరిగించాలి.
కనీసం పది నుంచి పన్నెండు నిమిషాల పాటు వాటర్ ను మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఆపై స్ట్రైనర్ సహాయంతో మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.
రోజు మార్నింగ్ ఈ వాటర్ ను తీసుకుంటే మీ శరీరంలో అద్భుతాలు జరుగుతాయి.నిత్యం ఈ మ్యాజికల్ వాటర్ ను తాగితే కొలెస్ట్రాల్( Cholestrol ) కరుగుతుంది.
గుండెకు ముప్పు తగ్గుతుంది రక్తపోటు అదుపులో ఉంటుంది.మధుమేహం వచ్చే రిస్క్ తగ్గుతుంది.
ఒకవేళ ఆల్రెడీ మీకు మధుమేహం ఉన్నట్లయితే ఈ వాటర్ బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేయడానికి సహాయపడుతాయి.

అంతేకాదు ప్రతిరోజు ఈ వాటర్ తాగితే చర్మం తెల్లగా కాంతివంతంగా మారుతుంది.శరీరంలో క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా ఉంటాయి.ఇమ్యూనిటీ సిస్టమ్( Immunity Power ) స్ట్రాంగ్ అవుతుంది.
జీర్ణవ్యవస్థ పనితీరు చురుగ్గా మారుతుంది.గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.
నిద్రలేమి సమస్య సైతం వదిలిస్తుంది.