ఢిల్లీ మద్యం పాలసీ కేసు( Delhi Liquor Policy Case )లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha: ) అరెస్ట్ కావటం తెలిసిందే.ఆమె ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు.
ఈ కేసులో కవిత మూడు నెలలుగా జైలులో ఉంటున్నారు.ఎన్నోసార్లు బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది.
ఈసారి కూడా బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టునీ ఆశ్రయించడం జరిగింది.ఈ క్రమంలో లిక్కర్ స్కాంలో సిబిఐ, ఈడీ కేసుల్లో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది.
ఆమె దాఖలు చేసిన రెండు బెయిల్ పిటిషన్లపై సోమవారం విచారణ జరిగింది. ఈడీ, సీబీఐ కేసుల్లో తనకు బెయిల్ నిరాకరిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.రెండు పిటిషన్ లను దాఖలు చేయగా ఢిల్లీ హైకోర్టు( High Court of Delhi) తిరస్కరించింది.దీంతో సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయడానికి కవిత తరపు లాయర్లు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ, సీబీఐ కేసుల్లో మే 6న కవిత బెయిల్ పిటిషన్లను ట్రయల్ కోర్టు తిరస్కరించింది.మార్చి 16న లిక్కర్ పాలసీ ఈడీ కేసులో, ఏప్రిల్ 11న సీబీఐ కేసులో కవిత అరెస్టు అయిన సంగతి తెలిసిందే.
కవితా ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో తీహార్ జైలులో ఉన్నారు.