సోమవారం జులై మొదటి తారీకు నేపథ్యంలో ఏపీలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది.ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం జులై మొదటి తారీకు 7వేల రూపాయలు పెన్షన్ దారులకు కూటమి ప్రభుత్వం అందించింది.
సచివాలయ సిబ్బంది చేత పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.జులై మొదటి తారీకు ఉదయమే గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం( Mangalagiri Assembly constituency ) పరిధిలోని పెనుమాక పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.
అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హాజరయ్యి స్థానిక ప్రజలతో ముచ్చటించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్( Nara Lokesh ) పలువురు తెలుగుదేశం నేతలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం పై మంత్రి నారాలోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది.అవ్వ తాతల కళ్ళల్లో నేడు నేను చూసిన ఆనందం జీవితాంతం గుర్తుంటుంది.
ప్రజా నాయకుడికి… పరదాల నాయకుడికి మధ్య తేడా ప్రజలకు అర్థమయిందని వ్యాఖ్యానించారు.మాట మార్చుడు లేదు మడమతిప్పుడు లేదు విడతల వారి డ్రామాలు లేవు అని అన్నారు.
ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం పెద్ద కొడుకుగా పెన్షన్ ను చంద్రబాబు( CM Chandrababu ) ₹4,000 చేశారని ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ చేశారని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించడం జరిగింది.