జులై 4వ తారీఖు ఢిల్లీ వెళ్ళబోతున్న సీఎం చంద్రబాబు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయు( Chief Minister Chandrababu Naidu )డు జులై 4వ తారీఖున ఢిల్లీ వెళ్ళనున్నారు.ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక చంద్రబాబుకు ఇదే తొలి ఢిల్లీ పర్యటన.

 Cm Chandrababu Is Going To Delhi On Fourth Of July Cm Chandrababu, Delhi ,cm Cha-TeluguStop.com

ఈ పర్యటనలో ప్రధాని మోదీ కేంద్రా ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్( Nirmala Sitharaman ) ను కలవబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.కేంద్రం నుంచి రాష్ట్రానికి రావలసిన సాయంపై ఇంకా నిధులపై చర్చించే అవకాశం ఉంది.

అంతేకాదు ఈ ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్ ను జులై 22న పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తగిన రీతిలో కేటాయింపులు చేయాలని కేంద్ర పెద్దలను సీఎం చంద్రబాబు కోరనున్నట్లు సమాచారం.

అంతేకాదు విభజన హామీలు మరియు పోలవరం ప్రాజెక్టు( Polavaram project ) తదితర అంశాలపై కూడా కేంద్ర పెద్దల భేటిలో ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి.కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడటంలో తెలుగుదేశం కీలకంగా మారింది.దీంతో చంద్రబాబు ఢిల్లీ పర్యటన అన్ని రకాలుగా ఆసక్తికరంగా మారింది.

ఇదిలా ఉంటే ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న నితీష్ కుమార్ ఇటీవల బీహార్ కి ప్రత్యేక హోదా అంటూ డిమాండ్ చేయడం జరిగింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్ సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా అంటూ అప్పట్లో ప్రకటన చేయడం జరిగింది.

ఏపీకి ప్రత్యేక హోదా అంశం ఎప్పటినుంచో పెండింగ్ లో ఉంది.రాష్ట్ర విభజన సమయంలో బీజేపీ నేతలు ఏపీకి ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు ప్రత్యేక హోదా కల్పించాలని కామెంట్లు చేయడం జరిగింది.

సో ఇటువంటి పరిస్థితులలో చంద్రబాబు ఢిల్లీ పర్యటన  ఆసక్తికరంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube