కోలీవుడ్‌లో మోస్ట్ కాంట్రవర్షల్ టాపిక్ ఏదైనా ఉందంటే అది సుచీ లీక్స్( Suchi Leaks ) అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు ఈ లీక్స్ అన్నీ చేసేది సింగర్ సుచిత్ర.తమిళ సినిమా ఇండస్ట్రీలోని అక్రమ సంబంధాలు, సీక్రెట్ మ్యాటర్స్ ఆమె బయట పెడుతుంటుంది.
అయితే అవన్నీ నిజం కావు, అలాగని అవన్నీ అబద్ధం కూడా కాకపోవచ్చు.ఆధారాలు లేకుండా ఆమె చేసిన లీక్స్ కారణంగా ధనుష్, హన్సిక, త్రిష వంటి టాప్ సెలబ్రిటీలు చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు.
ఇప్పుడు మరోసారి ఆమె త్రిషపై షాకింగ్ అలిగేషన్స్ చేసింది.చాలా రోజులు పాటు కామ్ గా ఉన్న సుచిత్ర ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అయిపోయింది.
తమిళ సినిమా పరిశ్రమ లోపల జరిగే బాగోతాలను కస్తూరి, చిన్మయి కూడా బయట పెడుతుంటారు.అయితే వాళ్ళిద్దరూ సుచిత్ర లాగా మరీ సెన్సేషనల్ అలిగేషన్స్ చేయరు.
సుచిత్ర మాత్రం దేశం మొత్తం సెన్సేషనల్ కంట్రవర్సీ క్రియేట్ చేయాలని ఎప్పుడూ కోరుకుంటుంది.అదేవిధంగా ఆమె లీక్స్ ఉంటాయి.
ఆమె చేసే లీక్స్ లో కొన్ని నిజాలు ఉంటాయని సినిమా వాళ్ళే అంగీకరిస్తుంటారు.
సింగర్ సుచిత్ర తాజాగా విజయ్, త్రిష( Vijay, Trisha )ల మీద ఆరోపణలు చేసింది.“విజయ్, ఆయన భార్య సంగీత తిరిగి కలవాల్సి ఉంది.కానీ స్మాల్ ఫైటింగ్స్ వల్ల విజయ్ కుటుంబంలో కలతలు వచ్చాయి, ఇదే మంచి అవకాశంగా భావించి త్రిష విజయ్‌కు దగ్గర కావాలని చాలా ట్రై చేస్తుంది.ఇప్పుడు ఇండస్ట్రీలో వీళ్లిద్దరినీ ఎంజీఆర్, జయలలిత (MGR, Jayalalitha )బంధంతో కంపేర్ చేస్తున్నారు.” అంటూ జయలలిత అఫైర్‌ను కూడా ఇందులోకి లాగింది సుచిత్ర.‘‘ఎంజీఆర్‌పై జయలలిత ఆధారపడి జీవించింది.ఆయన ద్వారా రాజకీయాల్లో ఆరితేరింది, తరువాత అతడిని వదిలేసింది.అందుకే కరుణానిధి జయలలితని అసలు ఇష్టపడేవారు కాదు.అయితే జయలలిత రాజకీయాల్లో మంచి పొజిషన్ కి వచ్చాక ప్రజలకు మంచి చేసింది.
త్రిషకు మాత్రం ఆ అవకాశం రాదు., ఎందుకంటే విజయ్ ఎంజీఆర్ లాగా రాజకీయాల్లో రాణించలేడు.
రాజకీయాలపై విజయ్‌కు సలహాలు ఇచ్చే వారెవరో తెలియదు.కానీ అవన్నీ తప్పుడు సలహాలే’’ అని సుచిత్ర మరిన్ని కామెంట్లు చేసింది.
తమిళనాడు( Tamil Nadu )లో సినిమా హీరోలను దేవుళ్ళుగా చూస్తారు.అలాంటి హీరోలను ఎవరైనా ఏదైనా అంటే అస్సలు తట్టుకోలేరు, సీరియస్‌గా విరుచుకుపడతారు.అయితే ఇప్పుడు సుచిత్ర త్రిషను జయలలితతో పోల్చి చాలా పెద్ద దుమారం రేపింది.ఇక విజయ్ రాజకీయాల్లో వచ్చినా వేస్తే అంటూ ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట పెద్దగా రచ్చ సృష్టిస్తున్నాయి.
వీటన్నిటినీ చూడాలన్నట్లే సుచిత్ర ఈ కామెంట్లు చేసింది.ఇప్పుడు వాటిని చూస్తూ ఎంజాయ్ చేస్తోంది.
సాధారణంగా ఇండస్ట్రీలో హీరోయిన్లు ఒకరి అండ కోసం పాకులాడటం సహజమే.అలాగని త్రిషను విజయలలితతో పోల్చుతూ పరాన్నజీవి అని అనడం సరైనది కాదు.
త్రిష ఈ వయసులోనూ బాగానే ఫిట్నెస్ మైంటైన్ చేస్తూ మంచి సినిమాలు ఎంచుకుంటూ చాలా కృషి చేస్తోంది.ఆమెపై అనవసరంగా కామెంట్లు చేయడం సుచిత్రకు మంచిది కాదు అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు.