2014లో మోదీ ప్రభుత్వం( Narendra Modi ) తీసుకున్న అతిపెద్ద నిర్ణయాలలో నోట్ల రద్దు ఒకటి.సరిగ్గా 2016 సంవత్సరం చివరిలో తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.500, 1000 రూపాయలు నోట్లు రద్దు చేయటం జరిగింది.ఆ తర్వాత కేంద్రం 2000 నోట్లు వాడుకలో తీసుకురావడం జరిగింది.
అయితే ఆ తర్వాత కొన్నాళ్ళకు 2000 నోట్లు కూడా రద్దు చేయడం జరిగింది.నల్లధనాన్ని నిర్మూలించడానికి అప్పట్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి.
ఇదిలా ఉంటే ప్రస్తుతం లోక్ సభ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో నోట్ల రద్దు అంశంపై విపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు.నోట్ల రద్దుతో దేశం తీవ్రంగా నష్టపోయిందని విమర్శించారు.నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల దేశ ప్రజలకు కలిగిన లాభం ఏమిటి అని ప్రశ్నించారు.జీఎస్టీ వల్ల ప్రజలు, వ్యాపారులు ఎన్నో బాధలు పడ్డారు.నోట్ల రద్దు వల్ల దేశంలో యువత ఉపాధి కోల్పోయారు.
దేవుడితో ప్రత్యక్షంగా మాట్లాడతానని మోదీ చెప్పారు.నోట్ల రద్దు చేయాలని దేవుడు చెప్పాడా.? అదానీ లాంటి పెద్దల కోసమే మోదీ నిర్ణయాలు తీసుకుంటారు అని రాహుల్( Rahul Gandhi ) లోక్ సభలో సోమవారం మండి పడటం జరిగింది.