వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం విదేశాలకు వలస వెళ్తున్న భారతీయులు అక్కడ అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తున్న సంగతి తెలిసిందే.అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా , దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ తదితర దేశాలలో భారతీయులు రాజకీయాలను శాసిస్తున్నారు.
తాజాగా సింగపూర్‌లో భారత సంతతికి చెందిన ప్రతిపక్షనేత ప్రీతమ్ సింగ్ ( Pritam Singh )వర్కర్స్ పార్టీ సెక్రటరీ జనరల్‌గా మరోసారి ఎన్నికయ్యారు.

సాధారణ ఎన్నికలకు ముందు ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.వర్కర్స్ పార్టీ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (సీఈసీ) చైర్‌వుమెన్ సిల్వియా లిమ్ నేతృత్వంలోని మొత్తం 14 మంది సభ్యులు ఓటింగ్‌లో పాల్గొన్నారు.48 ఏళ్ల ప్రీతమ్ సింగ్ ఆదివారం వర్కర్స్ పార్టీ ( Workers Party )సెక్రటరీ జనరల్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఆయన 2018 నుంచి ఆ పార్టీకి సెక్రటరీ జనరల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఎన్నిక తర్వాత ప్రీతమ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.వచ్చే రెండేళ్ల పాటు సీఈసీతో కలిసి పనిచేయడానికి తాము ఎదురుచూస్తున్నామన్నారు.ఇది అభ్యర్ధిత్వం గురించి కాదని పార్టీ అంతర్గత ఎన్నికలని.
అందువల్ల తన వ్యాఖ్యలు దానికే పరిమితం చేయబడతాయని సింగ్ తెలిపినట్లు ఛానెల్ న్యూస్ ఆసియా పేర్కొంది.రెండేళ్ల కాలపరిమితితో ఎన్నుకోబడిన వర్కర్స్ పార్టీ సీఈసీ .త్వరలో జరగనున్న సింగపూర్ సాధారణ ఎన్నికలకు సిద్ధంగా ఉందని మీడియా నివేదికలు చెబుతున్నాయి.షెడ్యూల్ ప్రకారం 2025 నవంబర్‌లో సింగపూర్‌లో ఎన్నికలు జరగాల్సి ఉంది, అయితే ఏడాది ముందుగా 2024 నవంబర్‌లోనే ఎన్నికలు జరుగుతాయంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
వర్కర్స్ పార్టీ మాజీ సభ్యురాలు రయీసా ఖాన్ కేసుపై పార్లమెంట్‌లో అబద్ధాలు మాట్లాడినందుకు గాను ఈ ఏడాది మార్చి 19న ప్రీతమ్ సింగ్‌పై కోర్టులో అభియోగాలు మోపారు.లైంగిక వేధింపుల కేసుపై ఖాన్ 2021లో పార్లమెంట్‌లో అబద్ధం చెప్పారని పోలీసులు తప్పుగా కేసును డీల్ చేశారని ఆరోపించారు.
తనపై దాఖలైన అభియోగాలను ఖండించిన సింగ్‌పై ఈ ఏడాది అక్టోబర్‌లో విచారణ జరగనుంది.