శంకర్ డైరెక్షన్ లో వస్తున్న భారతీయుడు 2 ( Bharateeyudu 2 ) సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి.అయితే ఈ సినిమా జూలై 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ను సినిమా యూనిట్ శరవేగంగా చేస్తున్నారట.
రీసెంట్ గా కమల హాసన్( Kamal Haasan ) కల్కి సినిమాతో ప్రేక్షకులను ముందుకు వచ్చి వాళ్ళను మెప్పించాడు.కాబట్టి అదే ఊపు లో ఆయన ఇప్పుడు కూడా ఒక భారీ సక్సెస్ ని అందుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తుంది.
మరి ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం భారతీయుడు 2 సినిమా ఒక బిగ్గెస్ట్ సక్సెస్ ని సాధిస్తే కనక కమలహాసన్ కెరియర్ లోనే ఇది ఒక మైలు రాయిగా మిగిలిపోతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…ఇక కల్కి సినిమా( Kalki Movie ) ఇచ్చిన ఊపుతో కమలహాసన్ మరిన్ని సినిమాలకు కూడా సైన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.ఇక విలన్ పాత్రల( Villain Roles ) కోసం కొంత మంది దర్శకులు కమలహాసన్ ను అప్రోచ్ అవుతున్నారు అనే వార్తలైతే వినిపిస్తున్నాయి.ఇక సూర్య( Surya ) హీరోగా కార్తిక సుబ్బరాజ్ డైరెక్షన్ లో వస్తున్న సినిమాలో కూడా కమలహాసన్ ను విలన్ గా తీసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారట.
మరి కమల హాసన్ ఈ సినిమాలో చేస్తాడా లేదా అని దాని మీద ఇంకా క్లారిటీ రాలేదు కానీ సినిమా యూనిట్ అయితే ఆయనకి కథ వినిపించినట్టుగా తెలుస్తుంది.మరి ఇంకా ఆయన ఈ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి… ఒకవేళ ఆ సినిమాలో కనుక చేసినట్లయితే ఇక విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆయనకి మంచి పాత్రలు దొరుకుతాయి.ఒకవేళ భారతీయుడు 2 సినిమా కనక హిట్ అయితే మళ్ళీ ఆయన హీరో పాత్రలను వేసే అవకాశాలు కూడా ఉన్నాయి…
.