తెలుగు సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా తనదైన రీతిలో సినిమాలను తీసుకుంటు ముందుకెళ్తున్న హీరోలలో విజయ్ దేవరకొండ ( Vijay Deverakonda )ఒకరు.ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ కల్కి సినిమాలో అర్జునుడి పాత్ర లో నటించి మంచి పేరు సంపాదించుకున్నాడు.
అయితే ఈయన చేసిన ఈ పాత్రలో ఆయన మీద కొన్ని నెగిటివ్ కామెంట్స్ అయితే వచ్చాయి.
ఎందుకు అంటే అర్జున్ రెడ్డి ( Arjun Reddy)సినిమాలో ఇలాంటి మాదిరి డైలాగ్స్ అయితే చెప్పాడో అర్జునుడి క్యారెక్టర్ లో కూడా అలాంటి డైలాగులే చెప్పడం ఆ స్లాంగ్ మారకపోవడం అనేది కొంతవరకు అభిమానులకు మింగుడు పడలేదు.కాబట్టి మరి దానికి సినిమా యూనిట్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ అయితే రాలేదు.ఇక మొత్తానికి అయితే విజయ్ దేవరకొండ తన ఖాతాలో ఒక మంచి సక్సెస్ అయితే వేసుకున్నాడు.
ఇక ఇదే ఉత్సాహంతో ఇప్పుడు విజయ్ చేస్తున్న మూడు సినిమాల మీద మంచి ఫోకస్ అయితే చేస్తున్నాడు.ఇక ఎలాగైనా మంచి విజయాన్ని అందుకోవాలని తను చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఇక అర్జునుడి క్యారెక్టర్ లో పాన్ ఇండియా లెవెల్లో చేసిన విజయ్ దేవరకొండ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.ఇక దాంతో బాలీవుడ్ లో కూడా ఆయన పేరు మారుమ్రోగుతుంది.ఇక లైగర్ సినిమా( Liger )తో బ్యాడ్ నేమ్ తెచ్చుకున్న ఆయనకి ఈ క్యారెక్టర్ అనేది కొంతవరకు ఊరటనిచ్చిందనే చెప్పాలి…ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని సాధిస్తుంది.కాబట్టి విజయ్ దేవరకొండ కి కూడా చాలావరకు కెరియర్ పరంగా ఈ సినిమా హెల్ప్ అవుతుందనే చెప్పాలి…ఇక మోత్తనికైతే ప్రభాస్ ద్వారా విజయ్ దేవరకొండ కు కూడా ఒక భారీ సక్సెస్ అయితే దక్కింది…
.