పాములు, కొండచిలువలు అంటే చాలా మందికి భయం.కానీ కొందరు మాత్రం ఎంత పెద్ద పాము కళ్లెదురుగా వచ్చినా కూడా ఏ మాత్రం కంగారు పడకుండా చాలా ప్రశాంతంగా ఉంటారు.
ఇలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.కాలువలోంచి ఒక భారీ కొండచిలువను( Giant Python ) ఒక వ్యక్తి ఒంటరిగా బయటకు లాగుతున్న వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.
వీడియోలో, ఆ వ్యక్తి నీళ్లలో సగం ఉన్న కొండచిలువ వైపు నడుచుకుంటూ వెళ్తాడు.పాము కాస్త కోపంగా, దూకుడుగా తిరుగుతుంటుంది.అతను మాత్రం ఏ మాత్రం భయపడకుండా ఒక చిన్న వంతెన( Canal ) లాంటి దానిపై నిలబడ్డాడు.చాలా జాగ్రత్తగా నీళ్లలో ఉన్న కొండచిలువను పట్టుకుని బయటకు లాగడం మొదలుపెట్టాడు.
ఆ పాము అతన్ని కాటేయడానికి ప్రయత్నించినా, అతను చాలా తేలికగా తప్పించుకున్నాడు.నిదానంగా ఆ భారీ పామును కాలువలోంచి పైకి లేపాడు.
అతని ధైర్యం, ఆ పామును హ్యాండిల్ చేసిన విధానం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.
‘vishal snake saver’ అనే ఇన్‌స్టా యూజర్ ఈ వీడియోను షేర్ చేయగా, ఇప్పటికే 3.6 కోట్ల వ్యూస్ వచ్చాయి.ఆ వ్యక్తి ధైర్యానికి, ప్రమాదకరమైన పరిస్థితిని అతను ఎంత ప్రశాంతంగా హ్యాండిల్ చేశాడో చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు.
చాలా మంది సోషల్ మీడియా యూజర్లు షాక్ అవుతూనే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఒక నెటిజన్ కామెంట్ చేస్తూ, “నేనైతే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరిగెత్తేవాడిని.ఈ వ్యక్తి నిజంగా హీరో” అని అన్నారు.మరొకరు “అతను అంత ప్రశాంతంగా ఎలా ఉండగలిగాడు? నాకైతే భయంతో గుండె ఆగిపోయేలా ఉండేది.” అని కామెంట్ చేశారు.
కొందరు మాత్రం అతను ప్రొఫెషనల్ స్నేక్ హ్యాండ్లర్( Professional Snake Handler ) అయి ఉంటాడని అభిప్రాయపడ్డారు.ఒక కామెంట్లో “ఇది కేవలం నిపుణులు మాత్రమే చేయగలరు.నేను మాత్రం అంత పెద్ద పాము దగ్గరికి వెళ్లడానికి కూడా ధైర్యం చేయను” అని రాసుకొచ్చారు.
ఇంకొందరు మాత్రం భద్రత గురించి ఆందోళన చెందారు.ఒక యూజర్ “ఇది చాలా ప్రమాదకరంగా మారేది.
అడవి జంతువులను హ్యాండిల్ చేయడం రిస్క్” అని హెచ్చరించారు.
కొంతమంది మాత్రం ఫన్నీ కామెంట్స్ చేశారు.
ఒక నెటిజన్ “పాము బహుశా అతని కంటే ఎక్కువ భయపడి ఉంటుంది.అది ఎంత వేగంగా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుందో చూడండి” అని జోక్ చేశారు.
దీన్నీ మీరు కూడా చూసేయండి.