ఒడిశాలోని( Odisha ) భద్రక్ జిల్లా కలెక్టర్ దిలీప్ రౌత్రాయ్( Collector Dilip Routrai ) చేసిన పని ఇప్పుడు దేశం మొత్తం హాట్‌టాపిక్‌గా మారింది.పంట కొనుగోలులో జరుగుతున్న మోసాల్ని కళ్లారా చూడటానికి, సాక్షాత్తూ ఆయనే రైతులా( Farmer ) మారిపోయారు.
అవును, రైతుల కష్టాలు తెలుసుకోవడానికే దుస్తులు మార్చుకుని, మాస్క్ పెట్టుకుని మరీ మండీకి వెళ్లారు.
ధామ్నగర్ బ్లాక్‌లోని కటసాహి మండిలో శనివారం కలెక్టర్ చేసిన ఈ సాహసం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
షార్ట్స్, టీ-షర్ట్ వేసుకుని, ముఖానికి మాస్క్, తలకి టోపీ పెట్టుకుని, భుజంపై తెల్లటి గముచా వేసుకుని సాధారణ రైతులా కనిపించారు.ఎవ్వరికీ అనుమానం రాకుండా తన వాహనాన్ని దూరంగా పార్క్ చేసి, నడుచుకుంటూ మండీకి( Mandi ) వెళ్లారు.
అక్కడ ఎవరూ గుర్తించలేకపోవడంతో, రైతులతో మాట్లాడి వాస్తవాలు తెలుసుకున్నారు.

అసలు మోసం ఎలా జరుగుతుందో తెలుసుకోవడానికి కలెక్టర్ ఒక సామాన్య రైతులా నటించారు.వేరే రైతు టోకెన్ ఉపయోగించి ధాన్యం అమ్మడానికి ప్రయత్నించారు.అక్కడ ఉన్న సహకార సంఘం అధికారి క్వింటాల్‌కు 8 కిలోలు తక్కువగా తూకం వేస్తామని చెప్పడంతో కలెక్టర్ షాకయ్యారు.
పక్కనే ఉన్న రైతులు కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు.మంచి నాణ్యమైన ధాన్యం తెచ్చినా సరే, క్వింటాల్‌కు 8 కిలోలు తక్కువ చేస్తారని వాపోయారు.అంటే రైతులు ఎంత నష్టపోతున్నారో అర్థం చేసుకోవచ్చు.

మోసం జరుగుతోందని స్వయంగా తెలుసుకున్న కలెక్టర్ వెంటనే చర్యలు తీసుకున్నారు.సంబంధిత అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు.
సమాధానం ఇవ్వకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇంతకు ముందు కూడా ఇలాంటి మోసాలు జరగకుండా ఉండేందుకు సమావేశాలు పెట్టినా ఫలితం లేకపోయింది.
ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినా, రైతులు మోసపోతూనే ఉన్నారు.అందుకే కలెక్టర్ స్వయంగా రంగంలోకి దిగారు.
కలెక్టర్ రైతు వేషంలో మండీకి వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది.నెటిజన్లు, రైతులు ఆయన చర్యను మెచ్చుకుంటున్నారు.పాక్స్ (PACS), మిల్లర్లు కలిసి రైతులను ఎలా దోచుకుంటున్నారో కలెక్టర్ తన ఆపరేషన్ ద్వారా బయటపెట్టారు.ఈ ఘటన ధాన్యం కొనుగోలు ప్రక్రియలో బాధ్యతారాహిత్యాన్ని ప్రశ్నించేలా చేసింది.







