వైష్ణవి చైతన్య. యూట్యూబ్ వెబ్ సిరీస్ ల ద్వారా బాగా ఫేమస్ అయ్యింది ఈ క్యూట్ బ్యూటీ.
తన చక్కటి రూపంతో పాటు.అంతకు మించిన నటనతో అందరినీ అబ్బుర పరుస్తుంది.
ఏ క్యారెక్టర్ ఇచ్చినా అందులో పరకాయ ప్రవేశం చేస్తూ.వారెవ్వా అనిపిస్తుంది ఈ ముద్దుగుమ్మ.
పలు వెబ్ సిరీస్ లలో నటించి ఇప్పటికే మంచి గుర్తింపు పొందింది.తొలుత తను నటించి సాఫ్ట్ వేర్ డెవలపర్ అనే వెబ్ సిరీస్ జనాల్లోకి బాగా వెల్లింది.
భారీ సంఖ్యలో వ్యూస్ కూడా వచ్చాయి.అందులో వైష్ణవి నటనకు జనాలు ఫిదా అయ్యారు.
ఈ అమ్మాయికి మంచి ఫ్యూచర్ ఉందంటూ చర్చించుకున్నారు.
అందరూ అనుకున్నట్లుగానే వైష్ణవి చైతన్య వెండితెరపైకి చేరింది.
ఈ సోషల్ మీడియా స్టార్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.అలా వైకుంఠపురములో సినిమాలో అల్లు అర్జున్ చెల్లి పాత్రలో నటించింది.
కనిపించేది కొద్దిసేపే అయినా.చక్కటి నటనతో ఆకట్టుకుంది.
ఈ దెబ్బతో ఆమెకు మరిన్ని అవకాశాలు వస్తున్నాయి.ఆమె తర్వలో హీరోయిన్ గా తెరంగేట్రం చేయబోతున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి.
సోషల్ మీడియాలో వైష్ణవి చేసిన వెబ్ సిరీస్ లకు తోడు బన్నీ మూవీలో సిస్టర్ క్యారెక్టర్ చూసిన పలువురు దర్శక నిర్మాతలు ఆమెకు ఆఫర్లు ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే తను హీరోయిన్ గా దర్శనం ఇవ్వడం ఖాయం అనే మాటలు వినిపిస్తున్నాయి.సినిమారంగంలోకి వస్తే మరో తెలుగు అమ్మాయి స్టార్ హీరోయిన్ గా ఎదిగే అవకాశం ఉందంటున్నారు సినీ పండితులు.తన వెబ్ సిరీస్ లు చూసిన వారు ముమ్మాటికీ వాస్తవం అని చెప్తున్నారు.
ఇంతకీ తనకు హీరోయిన్ గా అవకాశం ఇవ్వబోతున్న నిర్మాతలు ఎవరో త్వరలో తేలనుంది.మొత్తానికి తను హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం మాత్రం ఖాయంగా తెలుస్తోంది.ఎప్పుడు అనేది మున్ముందు కన్ఫామ్ కానుంది.