సాధారణంగా కొందరికి పొట్ట వద్ద కొవ్వు బాగా పెరుకుపోతుంటుంది.అలాగే కొందరికి తొడ భాగాల్లో ఫ్యాట్ ఏర్పడుతుంది.
గంటల తరబడి కూర్చుని ఉండటం, ఆహారపు అలవాట్లు, శరీరానికి శ్రమ లేకపోవడం, అధిక బరువు, మద్యపానం తదితర కారణాల వల్ల తొడ బాగాల్లో కొవ్వు పేరుకుపోతూ ఉంటుంది.ఫలితంగా తొడలు లావుగా తయారవుతాయి.
దాంతో థైస్ ఫ్యాట్ ను కరిగించుకోవడం కోసం ఏం చేయాలో తెలియక తీవ్రంగా సతమతమైపోతుంటారు.అయితే ఇప్పుడు చెప్పబోయే చిట్కాలు పాటిస్తే చాలా సులభంగా మరియు వేగంగా తొడ భాగాల్లో పేరుకుపోయిన కొవ్వును కరిగించుకోవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం పదండి.
థైస్ ఫ్యాట్ ను కరిగించడానికి సైక్లింగ్ అద్భుతంగా సహాయపడుతుంది.
సైక్లింగ్ చేయడం వల్ల కాళ్లు, తొడలపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది.దీనివల్ల తొడ భాగంలో ఉండే కొవ్వు కరిగిపోతుంది.
కాబట్టి రోజుకు కనీసం అరగంట పాటు సైక్లింగ్ చేయడం అలవాటు చేసుకోండి.అలాగే పోషకాలు ఎక్కువగా, క్యాలరీలు తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోండి.
ఫ్యాటీ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ కు దూరంగా ఉండండి.
![Telugu Tips, Latest, Thigh Fat, Thighfat, Thigh Fat Tips-Telugu Health Tips Telugu Tips, Latest, Thigh Fat, Thighfat, Thigh Fat Tips-Telugu Health Tips](https://telugustop.com/wp-content/uploads/2023/01/simple-ways-to-get-rid-of-thigh-fatc.jpg )
మెట్లు ఎక్కి దిగడం వల్ల కూడా థైస్ ఫ్యాట్ కరుగుతుంది.ఆఫీసులో లేదా అపార్ట్మెంట్ లో లిఫ్ట్ వాడటం మానేసి మెట్లు ఎక్కడం దిగడం చేయండి.ఫలితంగా తొడ భాగాల్లో పేరుకుపోయిన కొవ్వు ఈజీగా కరుగుతుంది.
థైస్ ఫ్యాట్ ను కరిగించుకోవాలని భావించే వారికి స్విమ్మింగ్ ఉత్తమ ఎంపిక.రోజుకు ఇరవై నిమిషాల పాటు స్విమ్మింగ్ చేస్తే తొడలు నాజూగ్గా మారతాయని నిపుణులు చెబుతున్నారు.
వెయిట్ లాస్ కు కూడా స్విమ్మింగ్ గ్రేట్ గా సహాయపడుతుంది.
![Telugu Tips, Latest, Thigh Fat, Thighfat, Thigh Fat Tips-Telugu Health Tips Telugu Tips, Latest, Thigh Fat, Thighfat, Thigh Fat Tips-Telugu Health Tips](https://telugustop.com/wp-content/uploads/2023/01/simple-ways-to-get-rid-of-thigh-fatd.jpg )
ఇక స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక కప్పు కొబ్బరి నూనె వేసుకోవాలి.అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం పొడి వేసి కనీసం పది నిమిషాల పాటు ఉడికించాలి.ఆ తర్వాత స్టైనర్ సహాయంతో ఆయిల్ ను ఫిల్టర్ చేసుకుని చల్లారబెట్టుకోవాలి.
ఈ ఆయిల్ ను థైస్ కు అప్లై చేసుకుని కనీసం పదిహేను నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి తద్వారా కండరాలపై ప్రెజర్ పెరుగుతుంది.హిట్ పుడుతుంది ఫలితంగా ఫ్యాట్ కరుగుతుంది.