భారతదేశంలో చాలామందికి తమలపాకులు తినే అలవాటు కచ్చితంగా ఉంటుంది.ఎందుకంటే భారతదేశంలో తమలపాకులు తినడం శతాబ్దాల నుండి సాంప్రదాయంగా వస్తుంది.
ప్రజలు తమలపాకులు తినడానికి ఇష్టపడతారు.అంతేకాకుండా చదివే పిల్లలకు కూడా తమలపాకు రసం ఇవ్వడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
అంతేకాకుండా కడుపులో అల్సర్, మౌత్ అల్సర్ సమస్య కూడా తొలగిపోతుంది.తమలపాకులో ఐదు లేదా ఆరు తులసి ఆకులను వేసి రసం పిండి పిల్లలకు ఇస్తే జలుబు, దగ్గు తగ్గిపోతుంది.
ఎందుకంటే ఇందులో ఉండే గొప్ప ఆరోగ్య గుణాల కారణంగా ఇది ఆయుర్వేద మూలికగా పనిచేస్తుంది.తమలపాకులో ఆల్కలాయిడ్స్, టానిన్,ప్రొపేన్,పినైల్ లాంటి అనేక పోషకాలు తమలపాకులో ఉంటాయి.
ఇది శరీరానికి అనేక ప్రయోజనాలు అందిస్తుంది.తమలపాకు కూడా మంచి నొప్పి నివారిణి అని చెప్పవచ్చు.మన శరీరంపై గాయాలు, దద్దుర్లు ఉంటే తమలపాకుతో ఆ నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు.తమలపాకుల్లో పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి.
యూరిక్ యాసిడ్ తగ్గించడానికి తమలపాకు బాగా సహాయపడుతుంది.శరీరంలో యూరిక్ ఆమ్లం పెరిగితే శరీరానికి ప్రమాదమే.
కానీ తమలపాకు శరీరంలో యూరిక్ యాసిడ్ పెరగడాన్ని తగ్గిస్తుంది.ఇక తమలపాకులను తీసుకోవడం వలన జీర్ణ వ్యవస్థ కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
అయితే తమలపాకును క్రమం తప్పకుండా తీసుకోవడం వలన మలబద్ధకం, ఆమ్లత్వం లాంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.

తమలపాకులను తీసుకోవడం వలన చిగుళ్లకు మేలు జరుగుతుంది.తమలపాకులను క్రమం తప్పకుండా నమలడం వలన చిగుళ్ల వాపు కూడా తగ్గిపోతుంది.ఇక చలికాలంలో తమలపాకులను తింటే చాలా మంచిది.
తమలపాకులు తింటే జలుబు తగ్గుతుంది.ఇక బీట్రూట్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.
ఇది శరీర కొవ్వును సులభంగా విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది.అలాగే మిరియాల లో ఉండే పెప్పరిన్ జీర్ణక్రియకు సహాయపడుతుంది.
కాబట్టి తమలపాకు, నల్లమిరియాలు,బీట్రూట్ కలిపి తీసుకుంటే గ్యాస్ సమస్యలు, అజీర్ణం, విరేచనాలు, మలబద్ధకం, అసిడిటీ లాంటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.