కరోనా విలయతాండవం తర్వాత చాలామంది ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెడుతున్నారు.సరైన ఆహార నియమాలతో పాటు వ్యాయామం, వర్కౌట్లు లాంటివి చేస్తోన్నారు.
అంతకుముందు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టనివారు కూడా కరోనా ప్రభావం తర్వాత ఆరోగ్యం గురించి పట్టించుకుంటున్నారు.మంచి ఫిట్‌నెస్ కోసం జిమ్‌లకు పరుగులు పెడుతున్నారు.
ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహార నియమాలతో పాటు శారీరక శ్రమ కూడా అవసరం.బాడీకి అవసరమైన శారీరక శ్రమ కలిగించే పనులు చేయాలి.
అప్పుడు ఆరోగ్యంగా ఉండగలుగుతారు.
ఇక చాలామంది సిక్స్ ప్యాక్స్, కండరాలు( Muscles ) బలంగా కనిపించాలని జిమ్ కు వెళుతూ ఉంటారు.అయితే వర్కౌట్లతో పాటు మంచి ఆహారం తీసుకోవడం వల్ల కండరాలు దృఢంగా తయారవుతాయి.ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్ కండరాలు బలంగా తయారవడానికి బాగా ఉపయోగడతాయి.
వేరుశెనగలు( Peanuts ) కండరాల పెరుగుదలకు బాగా సహాయపడతాయి.వేరుశెనగలో జింక్, కాల్షియం, విటమిన్ ఈ, విటమిన్ బీ6 లాంటివి ఉంటాయి.
ఇవి బరువును తగ్గించడంతో పాటు బండరాల పెరుగుదలకు సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇక పిస్తాలో కూడా ఐరన్, పీచు, విటమిన్ సీ, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి.ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు ఎముకలు, కండరాలను బలంగా చేస్తాయి.ఇక గుమ్మడికాయ గింజ( Pumpkin Seeds )లు కూడా కండరాలు దృఢంగా ఉండటానికి సహాయపడతాయి.
గుమ్మడికాయ గింజల్లో ఖనిజాలు, విటమిన్లు, అధిక పీచు పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి.ఇక ఎండు అత్తిపండు( Figs ), మఖానా కూడా కండరాల పెరుగుదలకు బాగా ఉపయోగపడతాయి.
ఎండు అత్తి పండ్లలో మెగ్నీషియం, జింక్, పొటాషియం, విటమిన్ బీ6, కాల్షియం, ఐరస్ పుష్కలంగా లభిస్తాయి.ఇవి కండరాల బలహీనతను తొలగిస్తాయి.అయితే నానబెట్టిన అత్తి పండ్లను తినడం వల్ల లాభం ఉంటుంది.