తమలపాకు తో పాటు వీటిని కలిపి తీసుకుంటే నోటి క్యాన్సర్ తప్పదా..?

సాధారణంగా చెప్పాలంటే తమలపాకు( betel leaf ) గురించి దాదాపు చాలామందికి తెలిసి ఉంటుంది.రుచికరమైన భోజనం చేసిన తర్వాత పాన్ రూపంలో తమలపాకును తింటూ ఉంటారు.

 If You Take These Together With Betel Leaves, Is It Bound To Cause Oral Cancer ,-TeluguStop.com

ఇంకా చెప్పాలంటే పూర్వం రోజుల నుంచి కూడా తమలపాకును తినడం ఆనవాయితీగా వస్తూ ఉంది.చాలామంది తమలపాకులో పోకా, సున్నం, కలుపుకొని తింటుంటారు.

ఇలా తినడం వల్ల నోటి క్యాన్సర్( Oral cancer ) బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.అయితే ఒట్టి తమలపాకు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

తమలపాకు ను వివిధ వ్యాధులకు ఔషధంగా కూడా ఉపయోగిస్తారు.ఒట్టి తమలపాకు తినడం వల్ల జీర్ణ క్రియ మెరుగు పడుతుంది.

Telugu Antimicrobial, Ayurvedic, Betel, Cancer, Tips, Oral Cancer-Telugu Health

ఇంకా చెప్పాలంటే మలబద్దకం( constipation ) వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి.ప్రతిరోజు తమలపాకును నోట్లో వేసుకొని నమలడం వల్ల నోటి దుర్వాసన, దంతక్షయం, చిగుళ్ళ నొప్పులు,నోటి ఇన్ఫెక్షన్స్ వంటి అన్ని సమస్యలు దూరమవుతాయి.ఇంకా చెప్పాలంటే తమలపాకులో ఉండే యాంటీ మైక్రోబాయల్ ఏజెంట్లు( Antimicrobial agents ) నోటి సమస్యలను సమర్ధవంతంగా ఎదుర్కొంటాయి.ఇంకా వర్షాకాలంలో తరచూ వేధించే సమస్యలు అయిన జలుబు, దగ్గు వంటి వాటిని కూడా తమలపాకు తినడం వల్ల దూరం చేసుకోవచ్చు.

Telugu Antimicrobial, Ayurvedic, Betel, Cancer, Tips, Oral Cancer-Telugu Health

ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషిస్తాయి.ఇంకా చెప్పాలంటే తమలపాకును మెత్తగా చూర్ణంలా చేసుకుని గాయాలకు రాసుకోవడం వల్ల ఆ గాయాలు త్వరగా మానిపోతాయి.తమలపాకు చూర్ణాన్ని ప్రతిరోజు ఒక స్పూన్ తేనెలో కలుపుకొని తాగడం వల్ల మధుమేహం కూడా అదుపులో ఉంటుందని ఆయుర్వేద నిపుణులు( Ayurvedic experts ) చెబుతున్నారు.ఇందులో క్యాల్షియం, పోలిక్ యాసిడ్, విటమిన్ సి, విటమిన్ డి వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి.

ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొనేందుకు తగిన శక్తిని ఇస్తాయి.కాబట్టి ఒట్టి తమలపాకు ప్రతిరోజు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube