ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన పండ్లలో ద్రాక్ష( Grapes ) ఒకటి.పెద్దలే కాదు పిల్లలు కూడా ద్రాక్ష పండ్లను ఎంతో ఇష్టంగా తింటుంటారు.
ద్రాక్ష పండ్లలో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి.ద్రాక్ష పండ్లు ఆరోగ్యాన్ని పెంచడంతో పాటు కురుల సంరక్షణకు సైతం ఉపయోగపడతాయి.
ద్రాక్ష పండ్లలోని విటమిన్ సి, కాపర్, మరియు యాంటీ ఆక్సిడెంట్లు కుదుళ్లను బలపరిచి జుట్టు రాలడాన్ని( Hair Loss ) తగ్గిస్తాయి.ద్రాక్ష పండ్లలోని విటమిన్ ఎ మరియు ఐరన్ జుట్టు పెరుగుదలకు అవసరమైన పోషణ అందిస్తాయి.
అలాగే ద్రాక్ష పండ్లు హెయిర్ డ్యామేజీని తగ్గిస్తాయి.ప్రకాశవంతమైన జుట్టును ప్రోత్సహిస్తాయి.
మరి ఇంతకీ ద్రాక్ష పండ్లను జుట్టుకు ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం పదండి.

రెమెడీ 1:
మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక కప్పు ద్రాక్ష పండ్లు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ పెరుగు( Curd ) మరియు వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్( Coconut Oil ) వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.
నలభై నిమిషాల అనంతరం తేలికపాటి షాంపూను ఉపయోగించి తలస్నానం చేయాలి.ఈ ద్రాక్ష మాస్క్ హెయిర్ ఫాల్ ను దూరం చేస్తుంది.
జుట్టులో తేమను పెంచి.జుట్టును ఆరోగ్యంగా, మృదువుగా మెరిసేలా ప్రోత్సహిస్తుంది.

రెమెడీ 2:
ఒక కప్పు ద్రాక్ష పండ్లను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి.ఆపై ద్రాక్ష మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ అలోవెర జెల్,( Aloevera Gel ) వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్( Olive Oil ) వేసి మిక్స్ చేయాలి.ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.నలభై నిమిషాల అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తలస్నానం చేయాలి.
ఈ మాస్క్ జుట్టు రూట్స్‌ను దృఢంగా మారుస్తుంది.జుట్టు రాలడాన్ని ఆపుతుంది.
మరియు ఈ మాస్క్ తో జుట్టు చిట్లడం, విరగడం వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి.







