అల్జీమర్స్ అంటే ఏంటి.. వ్యాధి ల‌క్షణాలు ఎలా ఉంటాయి..?

అల్జీమర్స్.( Alzheimers ) గ‌త కొన్నేళ్ల నుంచి బాగా వినిపిస్తున్న ఒక వ్యాధి.65 సంవత్సరాలు పైబడిన వారికి ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ.85 ఏళ్ల పైబడిన వారిలో దాదాపు ముప్పై నుంచి యాభై శాతం మందికి అల్జీమర్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది.అస‌లు అల్జీమ‌ర్స్ అంటే ఏంటి? అది ఎందుకు వ‌స్తుంది? వ్యాధి ల‌క్షణాలు ఎలా ఉంటాయి? అన్న విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం.

 What Is Alzheimers And What Are The Symptoms Details, Alzheimer's, Alzheimer's-TeluguStop.com

అల్జీమ‌ర్స్ అంటే మెదడు కణాలను నాశనం చేసి, మెమరీ, ఆలోచనా శక్తి, ప్రవర్తనపై ప్రభావం చూపించే రుగ్మత.

ఇది డీమెన్షియా( Dimentia ) అనే మెదడు వ్యాధుల్లో అత్యంత సాధారణమైనది.అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ సమస్యలు, మధుమేహం, మెదడుకు నష్టం కలిగించే గాయాలు, గుండె సంబంధిత వ్యాధులు మానసిక ఆరోగ్యంపై( Mental Health ) ప్రభావం చూపి అల్జీమ‌ర్స్ కు కార‌ణం అవుతాయి.

కుటుంబంలో ఎవరికైనా అల్జీమర్స్ ఉంటే, అది వారసత్వంగా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి.అలాగే స్మోకింగ్, మద్యపానం వంటి చెడు వ్య‌స‌నాలు, సరైన నిద్ర లేకపోవ‌డం కూడా అల్జీమర్స్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి.

Telugu Alzheimers, Brain, Brain Disorder, Dimentia, Tips, Latest, Memory-Telugu

ల‌క్ష‌ణాల విష‌యానికి వ‌స్తే.ప్రారంభ దశలో చిన్న విషయాలను మర్చిపోవడం,( Memory Loss ) పనులను పూర్తి చేయడంలో సమస్యలు, మూడ్ స్వింగ్స్, ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం, పదాలు గుర్తు పెట్టుకోలేకపోవడం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి.మ‌ధ్య ద‌శ‌లో వ్యక్తులను మ‌ర‌చిపోతుంటారు.భావోద్వేగాల‌ను కంట్రోల్ చేసుకోలేక‌పోతుంటారు.సమయాన్ని, స్థలాన్ని గందరగోళంగా భావించడం, త‌ప్పుడు నిర్ణ‌యాలు తీసుకోవ‌డం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి.ఇక‌ అన్నింటికి పూర్తిగా మ‌ర‌చిపోవ‌డం, తినడం, నడవడం, మాట్లాడడం కూడా కష్టమవడం, శరీర నియంత్రణ కోల్పోవడం, పూర్తిగా ఇత‌ర‌ల‌పై ఆధార‌ణ‌ప‌డ‌టం ఆఖ‌రి ద‌శ‌లో క‌నిపించే ల‌క్ష‌ణాలు.

Telugu Alzheimers, Brain, Brain Disorder, Dimentia, Tips, Latest, Memory-Telugu

అల్జీమ‌ర్స్ ప్ర‌మాద‌క‌ర‌మా అంటే.ఖ‌చ్చితంగా అవున‌నే వైద్యులు చెబుతారు.అల్జీమర్స్ నివార‌ణ‌కు ప్ర‌స్తుతం పూర్తి చికిత్స లేదు.కానీ కొన్ని మందులు మ‌రియు థెరపీ వ్యాధి లక్షణాలను తగ్గించగలవు.ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, ఒత్తిడికు దూరంగా ఉండ‌టం, స‌రైన నిద్ర మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతుంది.పజిల్స్, బుక్స్ చదవడం, గణిత సమస్యలను ప‌రిష్క‌రించ‌డం వంటివి చేయ‌డం ద్వారా మెదడు వ్యాయామంగా మారుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube