అక్కినేని నాగచైతన్య(Nagachaitanya) తాజాగా నటించిన చిత్రం తండేల్ (Thandel).ఫిబ్రవరి 7వ తేదీ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు.
డైరెక్టర్ చందు మొండేటి (Chandu Mondeti)దర్శకత్వంలో నాగచైతన్య సాయి పల్లవి(Sai Pallavi)జంటగా రాబోతున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది.ఇక ఫిబ్రవరి 7న ఈ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ఇటీవల ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.
ఇక ఈ కార్యక్రమం కేవలం చిత్ర బృందం సమక్షంలో మాత్రమే నిర్వహించారు.ఇక ఈ కార్యక్రమం ప్రారంభానికి ముందే యాంకర్ సుమ నాగచైతన్యను ఆసక్తికరమైన ప్రశ్న వేశారు.

స్టేజ్ పై శోభిత(Sobhita) నాగచైతన్య ఉన్నటువంటి ఫోటోని చూయిస్తూ ఈ ఫోటో చూస్తూ మీరు ఏదైనా సాంగ్ డెడికేట్ చేయాలి లేదా డైలాగ్ డెడికేట్ చేయాలనుకుంటున్నారా అంటూ ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు నాగచైతన్య సమాధానం చెబుతూ.శోభితకు బుజ్జి తల్లి(Bujji Thalli) పాటనే డెడికేట్ చేస్తాను ఎందుకంటే నేను తనని ఇంట్లో బుజ్జి తల్లి అని పిలుస్తాను అంటూ నాగచైతన్య తెలిపారు.ఈ విషయం చందుకి కూడా తెలుసు అంటూ మాట్లాడటంతో వెంటనే డైరెక్టర్ చందు కల్పించుకొని అవును సినిమా స్టార్ట్ అవ్వకముందే నాకు చెప్పారు.
ఇది విని చాలా ఆశ్చర్యపోయానని తెలిపారు.

ఇక వీరి పెళ్లి కని వెళ్తే అక్కడ శోభిత నాతో మాట్లాడుతూ.నిజానికి బుజ్జి తల్లి అనేది నా పేరు, సరే సినిమా వరకు ఓకే అనుకుంటే పాట కూడా పాడేశారా అని ఆమె అన్నారని తెలియజేశారు.అనంతరం నాగచైతన్య మాట్లాడుతూ.
నిజానికి బుజ్జి తల్లి పాట వచ్చిన తర్వాత శోభిత చాలా ఫీల్ అయిందని తెలిపారు.ఆమె బుజ్జి తల్లి అనేది తన సిగ్నేచర్ లాగా ఫీల్ అయ్యేది.
దాన్ని సినిమాల్లో ఎలా వాడేస్తావు అంటూ శోభిత ఫీల్ అయింది అంటూ నాగచైతన్య చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







