1.బిజెపి పై రాహుల్ గాంధీ కామెంట్స్

తెలంగాణలోని బిజెపిని తుడిచి పారేస్తామని కాంగ్రెస్ కి అగ్ర నేత రాహుల్ గాంధీ( Rahul Gandhi ) వ్యాఖ్యానించారు.
2.ప్రొఫెసర్ కోదండరాం ఆసక్తికర వ్యాఖ్యలు

వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో అయినా పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండ రామ్( Prof.Kodandaram ) అన్నారు.
3.హెల్త్ టూరిజం పై కిషన్ రెడ్డి కామెంట్స్
హెల్త్ టూరిజంలో టాప్ 10 దేశాల్లో భారత్ కూడా ఉందని కేంద్ర పర్యటన శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
4.జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు

దేశంలోని 23 ఐఐటీలో వచ్చే విద్యా సంవత్సరం బిటెక్ సెట్ల భర్తీకి ఈరోజు జేఈఈ అడ్వాన్స్ పరీక్ష ప్రారంభమైంది.
5.ఎన్టీఆర్ హై స్కూల్ లో ఉచిత విద్య కు దరఖాస్తుల ఆహ్వానం
ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కృష్ణాజిల్లా చల్లపల్లిలో మీ ఎన్టీఆర్ హైస్కూల్లో ఉచిత విద్యకు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు.
6.మంత్రి అంబటి విమర్శలు
వైఎస్ జగన్ తీసుకొచ్చింది మేనిఫెస్టో అయితే చంద్రబాబు ప్రవేశపెట్టింది మోసపెస్థో అని ఏపీ మంత్రి అంబటి రాంబాబు( Ambati Rambabu ) విమర్శించారు.
7.చంద్రబాబుపై విమర్శలు
చంద్రబాబు లాంటి మోసగాడు దేశ చరిత్రలోనే ఉండడని వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి విమర్శించారు.
8.కెసిఆర్ పై ఎంపీ అరవింద్ విమర్శలు
ఫామ్ హౌస్ లు కట్టుకున్న వారికి పేదల సమస్యలు ఏం తెలుస్థాయి అని తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి నిజామాబాద్ బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శలు చేశారు
9.ప్రధాని నరేంద్ర మోడీపై కేఏ పాల్ విమర్శలు

ఒడిస్సా రాష్ట్రంలోని బాలసూర్ లో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్( K.A.Paul ) స్పందించారు.రైలు ప్రమాదానికి ప్రధాని నరేంద్ర మోడీ బాధ్యత వహించి పదవి రాజీనామా చేయాలని పాల్ డిమాండ్ చేశారు.
10.జగన్ పోలవరం పర్యటన

వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ రేపు పోలవరం సందర్శనకు బయలుదేరి వెళ్ళనున్నారు.
11.చంద్రబాబుపై మంత్రి కామెంట్స్
చంద్రబాబు
కుయుక్తులను ఎవరు నమ్మవద్దని వైసిపి మంత్రి మెరుగు నాగార్జున అన్నారు.
12.ఒడిశా రైలు ప్రమాదం

ఒడిశాలో కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాద ( Coromandel Express )ఘటనపై ఏపీ మంత్రి నారాయణ స్పందించారు ఏపీ నుంచి ఎవరు ఈ ప్రమాదంలో చనిపోలేదని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు.
13.రైలు ప్రమాదంపై రాజమండ్రి ఎంపీ స్పం
దన
ఒడిస్సా రైలు ప్రమాదం పై సమగ్ర దర్యాప్తు జరిపించాలని రాజమండ్రి వైసీపీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు.
14.శ్రీకాంతాచారి తల్లికి సన్మానం
యాదాద్రి జిల్లా కలెక్టరేట్లో తెలంగాణ తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ కు సన్మానం చేశారు.
15.గ్రూప్ వన్ పరీక్ష హాల్ టికెట్లు విడుదల

జూన్ 11న జరగనున్న గ్రూప్ వన్ పిలిమినరీ పరీక్ష హాల్ టికెట్స్ ను ఈరోజు విడుదల చేసినట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది.
16.తెలంగాణకు వర్ష సూచన
రానున్న మూడు రోజుల్లో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
17.ఒడిస్సా దుర్ఘటనలు ఏపీ బాధితులకు పరిహారం
కోరమండల్ ఎక్స్ప్రెస్ ప్రమోద ఘటనలో ఏపీకి చెందిన ఒకరు మృతిచెందగా మరికొంత మంది గాయాలయ్యారు.ఈ సందర్భంగా మృతి చెందిన వారికి గాయపడిన వారికి పరిహారం ఏపీ సీఎం జగన్ ప్రకటించారు.
18.ఒడిస్సా రైలు ప్రమాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్
ఒడిస్సా రైలు ప్రమాదంపై సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు అయింది .ప్రజలకు భద్రత కల్పించడానికి రైళ్లల్లో కవచ్ ప్రొటెక్షన్ సిస్టం వెంటనే అమలు చేసే విధంగా మార్గదర్శకాలు ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది.
19.మావోయిస్టు అగ్రనేత సుదర్శన్ మృతి
మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ గుండుపోటుతో మృతి చెందారు.
20.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 55,300
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 60,330
.