పుష్ప సినిమాలో( Pushpa Movie ) చాలామంది ప్రముఖ నటీనటులు యాక్ట్ చేశారు వారిలో రష్మిక మందన్న, ధనంజయ, జగదీష్ ప్రతాప్ బండారి, అజయ్, రాజ్ తిరందాసు, ఫహద్ ఫాసిల్, సునీల్, రావు రమేష్, అజయ్ ఘోష్, అనసూయ వంటి వాళ్లు ఉన్నారు.ఈ సినిమా పెద్ద హిట్ కావడం వల్ల వారందరికీ గుర్తింపు వచ్చింది.
అయితే ఈ పాన్ ఇండియా హిట్ మూవీని ఆరుగురు యాక్టర్లు రిజెక్ట్ చేసి పెద్ద తప్పు చేశారు.వారెవరో తెలుసుకుందాం.
• రవికృష్ణ

తోట రవి కృష్ణను( Thota Ravikrishna ) పుష్ప-2 సినిమాలోని ఒక ఇంపార్టెంట్ రోల్ కోసం సుకుమార్ అప్రోచ్ అయ్యాడు.అయితే లవ్ మీ ఇఫ్ యు డేర్ అనే సినిమాలో అతడు బిజీగా ఉండి పుష్ప సినిమాను రిజెక్ట్ చేశాడు.విరూపాక్ష, గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాల ద్వారా ఈ నటుడు బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు పుష్ప సినిమాలో కూడా యాడ్ చేసి ఉంటే ఇంకా మంచి పేరు తెచ్చుకునే ఉండేవాడు కానీ మరో మూవీకి కామెంట్ కావడం వల్ల అతడు దీనిని వదిలేసుకోవాల్సి వచ్చింది.
• సాయి బాబా

గబ్బర్ సింగ్ లాంటి సినిమాల్లో నటించే గుర్తింపు తెచ్చుకున్నాడు సాయి బాబా.( Sai Baba ) ఈ నటుడికి పుష్పటు సినిమాలో నటించే అద్భుతమైన ఛాన్స్ వచ్చింది అయితే బన్నీతో నటించడం ఇష్టం లేక ఈ నటుడు దానిని రిజెక్ట్ చేశాడు.
• మహేష్ విట్ట, సుహాస్

పుష్ప పార్ట్-1 సినిమాలో దేశవార్లు కోసం మొదటగా యాక్టర్ మహేష్ విట్టను( Mahesh Vitta ) తీసుకోవాలని సుకుమార్ అని భావించాడు కానీ అతను కొన్ని కారణాలవల్ల దీనిని చేయలేకపోయాడు తర్వాత హీరో సుహాస్‌ను( Suhas ) తీసుకుందామని భావించారు కానీ ఆ నటుడు కూడా దీన్ని చేయలేకపోయాడు.చివరికి జగదీష్ కి ఆ రోల్ రోజులు దక్కింది.
• విజయ్ సేతుపతి

తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి( Vijay Sethupati ) ఈ సినిమాలో విలన్ రోల్ చేయడానికి ఒప్పుకోలేదు.
• సమంత, దిశా పటాని

ఈ మూవీలో హీరోయిన్ రోల్ కోసం సమంతని( Samantha ) తీసుకోవాలనుకున్నారు కానీ ఆమె ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ కి ఒప్పుకోవడం వల్ల దాన్ని రిజెక్ట్ చేసింది.ఇక దిశ పటానీని( Disha Patani ) ఐటెం సాంగ్ కోసం అనుకున్నారు కానీ ఆమె కూడా ఈ మూవీని రిజెక్ట్ చేసింది.
ఇకపోతే ఈ మూవీలో బన్నీ పుష్పరాజ్ అనే కూలీగా పని చేస్తుంటాడు.ఆంధ్రప్రదేశ్‌లోని శేషాచలం అడవుల్లో పెరిగే ఎర్రచందనం చెట్లను అక్రమంగా తరలిస్తున్న ఒక గ్యాంగ్‌లో చేరతాడు.
ఈ గ్యాంగ్‌లో క్రమంగా ఎదగడానికి ప్రయత్నిస్తాడు.చాలా సమస్యలు ఎదురవుతాయి.
సెకండ్ పార్ట్ లో అతడు చివరికి ఏమయ్యాడు అనేది చూపించనున్నారు.పుష్ప 2 సినిమా ఈ ఏడాది డిసెంబర్ 6న విడుదల కానుంది.ఈ మూవీ రూ.500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది.