105 సంవత్సరాల వయస్సులో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన బామ్మ.. గ్రేట్ అంటూ?

సాధారణంగా ఒక వయస్సు దాటిన తర్వాత చదవడం సులువైన విషయం కాదు.105 సంవత్సరాల వయస్సులో మాస్టర్స్ డిగ్రీ( Masters Degree ) పూర్తి చేయడం అంటే ఒకింత అరుదైన విషయం అని చెప్పవచ్చు.అయితే ఒక బామ్మ( Grand Mother ) మాత్రం మధ్యలో వదిలేసిన చదువును పూర్తి చేసి వార్తల్లో నిలిచారు.పట్టుదలతో కష్టపడితే మాత్రమే లక్ష్యాన్ని సాధించే అవకాశాలు అయితే ఉంటాయి.105 ఏళ్ల వయస్సులో మాస్టర్స్ డిగ్రీ అంటే అరుదైన ఘనత అనే చెప్పాలి.

 Great Grand Mother Virginia Inspirational Success Story Details, Virginia Ginger-TeluguStop.com

ఈ వృద్ధ మహిళ పూర్తి పేరు వర్జీనియా జింజర్ హిస్లాప్( Virginia Ginger Hislop ) కాగా తాజాగా ఆమె డిగ్రీని అందుకున్నారు.ఈ డిగ్రీని అందుకోవడం కోసం ఎంతోకాలం నుంచి వేచి చూస్తున్నానని ఆమె పేర్కొన్నారు.1940 సంవత్సరంలో స్టాన్ ఫోర్డ్ లో( Stanford ) వర్జీనియాలో తరగతులను పూర్తి చేశారు.మాస్టర్స్ థీసిస్ లో ఉన్న సమయంలో రెండో ప్రపంచ యుద్ధం( Second World War ) వల్ల ఆమె చదువు మధ్యలోనే ఆగిపోవడం కొసమెరుపు.

భర్త యుద్ధం చేయడానికి వెళ్లిపోవడంతో వర్జీనియా కూడా తన చదువును త్యాగం చేశారు.భర్తకు తన వంతు సహాయం చేసిన వర్జీనియా ఆ తర్వాత కుటుంబ పోషణపై దృష్టి పెట్టారు.ఆమెకు ఇద్దరు పిల్లలు, నలుగురు మనుమలు కాగా తొమ్మిది మంది మనవరాళ్లు కావడం గమనార్హం.

వాషింగ్టన్ స్టేట్ లోని స్కూల్, కాలేజ్ బోర్డ్ లలో దశాబ్దాలుగా పని చేసి ఆమె ప్రశంసలు అందుకున్నారు.

డిగ్రీ పుచ్చుకోవాలనే తాపత్రయంతో ఎన్నో కలలు కన్న ఆమె ఆ కలలను ఎట్టకేలకు నెరవేర్చుకున్నారు.40 రోజుల క్రితం వర్జీనియా తన కలల మాస్టర్ డిగ్రీని నెరవేర్చుకోవడం కొసమెరుపు.డిగ్రీ పట్టా పుచ్చుకునే సమయంలో వర్జీనియా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

చదువుకోవడానికి వయస్సు ఏ మాత్రం అడ్డు కాదని ఈ బామ్మ ప్రూవ్ చేశారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube