105 సంవత్సరాల వయస్సులో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన బామ్మ.. గ్రేట్ అంటూ?

సాధారణంగా ఒక వయస్సు దాటిన తర్వాత చదవడం సులువైన విషయం కాదు.105 సంవత్సరాల వయస్సులో మాస్టర్స్ డిగ్రీ( Masters Degree ) పూర్తి చేయడం అంటే ఒకింత అరుదైన విషయం అని చెప్పవచ్చు.

అయితే ఒక బామ్మ( Grand Mother ) మాత్రం మధ్యలో వదిలేసిన చదువును పూర్తి చేసి వార్తల్లో నిలిచారు.

పట్టుదలతో కష్టపడితే మాత్రమే లక్ష్యాన్ని సాధించే అవకాశాలు అయితే ఉంటాయి.105 ఏళ్ల వయస్సులో మాస్టర్స్ డిగ్రీ అంటే అరుదైన ఘనత అనే చెప్పాలి.

ఈ వృద్ధ మహిళ పూర్తి పేరు వర్జీనియా జింజర్ హిస్లాప్( Virginia Ginger Hislop ) కాగా తాజాగా ఆమె డిగ్రీని అందుకున్నారు.

ఈ డిగ్రీని అందుకోవడం కోసం ఎంతోకాలం నుంచి వేచి చూస్తున్నానని ఆమె పేర్కొన్నారు.

1940 సంవత్సరంలో స్టాన్ ఫోర్డ్ లో( Stanford ) వర్జీనియాలో తరగతులను పూర్తి చేశారు.

మాస్టర్స్ థీసిస్ లో ఉన్న సమయంలో రెండో ప్రపంచ యుద్ధం( Second World War ) వల్ల ఆమె చదువు మధ్యలోనే ఆగిపోవడం కొసమెరుపు.

"""/" / భర్త యుద్ధం చేయడానికి వెళ్లిపోవడంతో వర్జీనియా కూడా తన చదువును త్యాగం చేశారు.

భర్తకు తన వంతు సహాయం చేసిన వర్జీనియా ఆ తర్వాత కుటుంబ పోషణపై దృష్టి పెట్టారు.

ఆమెకు ఇద్దరు పిల్లలు, నలుగురు మనుమలు కాగా తొమ్మిది మంది మనవరాళ్లు కావడం గమనార్హం.

వాషింగ్టన్ స్టేట్ లోని స్కూల్, కాలేజ్ బోర్డ్ లలో దశాబ్దాలుగా పని చేసి ఆమె ప్రశంసలు అందుకున్నారు.

"""/" / డిగ్రీ పుచ్చుకోవాలనే తాపత్రయంతో ఎన్నో కలలు కన్న ఆమె ఆ కలలను ఎట్టకేలకు నెరవేర్చుకున్నారు.

40 రోజుల క్రితం వర్జీనియా తన కలల మాస్టర్ డిగ్రీని నెరవేర్చుకోవడం కొసమెరుపు.

డిగ్రీ పట్టా పుచ్చుకునే సమయంలో వర్జీనియా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.చదువుకోవడానికి వయస్సు ఏ మాత్రం అడ్డు కాదని ఈ బామ్మ ప్రూవ్ చేశారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

రేణు దేశాయ్ కు చీర సారే పెట్టి సత్కరించిన తెలంగాణ మంత్రి.. కారణం ఇదేనా?