నేషనల్ అవార్డు విన్నర్ ధనుష్( Dhanush ) నటించిన “రాయన్” సినిమా( Raayan ) జులై 26న తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ అయింది.ఈ మూవీ విడుదలకు ముందు ధనుష్ తెలుగు స్టేట్స్‌కి వచ్చి సినిమాని ప్రమోట్ చేసుకున్నాడు.
ఆ సమయంలో అతడు తమిళంలోని మాట్లాడే షాక్ ఇచ్చాడు.కనీసం ఇంగ్లీషులో మాట్లాడినా ప్రజలకు అర్థం అయి ఉండేది.
టైటిల్ కూడా తమిళంలోనే ఉంచారు.కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమాకి ధనుష్ కథ అందించాడు.
అతనే డైరెక్ట్ చేశాడు.అయితే ఈ మూవీ అర్థం కాకుండా ఉందని చూసినవాళ్లు కామెంట్లు చేస్తున్నారు.

ఈ మూవీలో ఎలివేషన్లు ఉండవు.పాటలు అసందర్భంగా వచ్చి పోతుంటాయి.ప్రేక్షకుడిని ఆకట్టుకునే ఒక్క ఎమోషనల్ సన్నివేశం కూడా ఉండదు.చిన్న ఓన్లీ తమిళం వాళ్ల కోసమే తీశారు కానీ తెలుగు హిందీ మార్కెట్స్ పెద్దవి కాబట్టి డబ్ చేసి విడుదల చేశారు.
ధనుష్ అవార్డు విన్నర్ కాబట్టి ఇందులో కూడా ఇరగదీసాడు.కానీ స్టోరీ రైటర్ గా, డైరెక్టర్ గా ఫెయిల్ అయ్యాడు.ఇది ఈ హీరోకు 50వ సినిమా, దర్శకుడిగా సెకండ్ మూవీ.ఇందులో సందీప్ కిషన్,( Sundeep Kishan ) ఎస్జే సూర్య,( SJ Surya ) సెల్వ రాఘవన్, ప్రకాష్ రాజ్, అపర్ణా బాలమురళి, వరలక్ష్మి శరత్‌కుమార్ వంటి దిగ్గజ నటీనటులు యాక్ట్ చేశారు కానీ వారిని ఈ హీరో సరిగా వాడుకోలేకపోయాడు.
నటి అపర్ణా ధనుష్ తో కలిసి రొమాన్స్ చేసింది.

ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించాడు కానీ అది పెద్దగా మెప్పించలేకపోయింది.స్టోరీ, దర్శకత్వం బాగోలేకపోవడంతో సినిమా హిట్ టాక్ తెచ్చుకోలేకపోయింది.ఇదొక యాక్షన్ థ్రిల్లర్ మూవీ.
క్రైమ్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది.సీక్రెట్ గా ఓ ఫ్యామిలీ నివసించడం చుట్టూ ఈ సినిమా నడుస్తుంది.
ఇక ఇందులో చూపించిన అనుబంధాలన్నీ కూడా రొటీన్ స్టోరీలాగా కనిపిస్తాయి.ఇందులో గ్యాంగ్ వార్స్ కూడా ధనుష్ యాడ్ చేశాడు.
జోక్ ఏంటంటే అన్నకు తమ్ముళ్లే ఎదురు తిరుగుతారు.ఒక గ్యాంగ్ లాగా తయారవుతారు.
కథ గందరగోళంగా అనిపిస్తుంది.నిర్మాల విలువలు బాగానే ఉంటాయి కానీ కథ వల్లే ఈ సినిమా అంతంత మాత్రం కలెక్షన్లతో సరిపెట్టుకుంటుందని చెప్పవచ్చు.
ఇందులో నటి దుషారా విజయన్( Dushara Vijayan ) ధనుష్ చెల్లె దుర్గగా నటించింది ఆమె పాత్ర మేరకు చాలా బాగా యాడ్ చేసి మెప్పించింది.ఈ మూవీకి ధనుష్, దుషారా నటన మాత్రమే ప్లస్ పాయింట్స్ మిగతా సినిమా అంతా చూడదగినది కాదు.