ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొద్ది రోజుల క్రితం కేంద్ర బడ్జెట్ 2024ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.మధ్యతరగతి ప్రజల్లో ఈ బడ్జెట్ చాలా నిరాశ కలిగించింది.
ఈసారి ట్యాక్స్‌లో ( Tax ) తీసుకొచ్చిన మార్పులు ప్రజల సంపాదనలో సగం శాతం కాజేసే లాగా ఉన్నాయి.ఇప్పటికీ ట్యాక్స్ స్లాబ్స్ గురించి ప్రజలు చర్చిస్తున్నారు.
పన్నులు కట్టలేక వాటిని ఆదా చేసేందుకు ప్రజలు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఓ ట్రావెల్ బ్లాగర్( Travel Blogger ) తన యూట్యూబ్ వీడియోలో చాలా హాస్యాస్పదమైన, కానీ చాలా మందికి ఆకర్షణీయంగా అనిపించే ఒక ట్యాక్స్ ఐడియా చెప్పాడు.
ఆయన అంటున్నది ఏమిటంటే, ఒక వ్యక్తి తన జీతం కంటే గడ్డి( Grass ) అమ్మడం ద్వారా వచ్చే ఆదాయాన్ని ఎక్కువగా చూపిస్తే, ఆయన ఆదాయపు పన్ను చెల్లించకుండా ఉండవచ్చు అని.ఈ వీడియో కర్ణాటకలోని ఉడుపికి చెందిన శ్రీనిధి హందే( Shrinidhi Hande ) అనే వ్యక్తి చేశాడు, ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఆ వ్యక్తి తన వీడియోలో చాలా సులభమైన, చట్టబద్ధమైన పద్ధతిలో ఆదాయపు పన్ను చెల్లించకుండా( Tax Exemption ) ఉండవచ్చని చెప్పాడు.ఆయన చెప్పిన పద్ధతి ఇలా ఉందంటే.ముందుగా గడ్డిని పెంచాలి.తరువాత తమ కంపెనీ HRతో మాట్లాడి, తమకు జీతం అవసరం లేదని చెప్పాలి.జీతం చెల్లించడానికి బదులుగా కంపెనీ తన నుంచి గడ్డిని కొనాలని చెప్పాలి.ఉదాహరణకు, ఒకవేళ జీతం 50,000 రూపాయలు అయితే, ప్రతి గడ్డి పోగుకు 1,000 రూపాయల చొప్పున 50 గడ్డి పోగులు కొనాలని చెప్పాలి.
ఇలా గడ్డి అమ్మడం ద్వారా వచ్చిన ఆదాయం వ్యవసాయం ద్వారా వచ్చిన ఆదాయం కింద వస్తుంది.భారతదేశంలో వ్యవసాయ ఆదాయంపై ఆదాయపు పన్ను ఉండదు కాబట్టి, ఈ విధంగా ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు పొందవచ్చు.తెలివిగా శాలరీ పొందవచ్చు.TDS లేదా ఇన్వెస్ట్‌మెంట్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన చెప్పాడు.అతడు వీడియోకు లక్ష దాకా లైక్స్ వచ్చాయి, న్యూస్ కూడా అదే రేంజ్ లో వస్తున్నాయి చాలామంది ఇతడు చెప్పిన ఐడియా బాగుంది అని, అదే సమయంలో చాలా ఫన్నీగా ఉందని నవ్వుకుంటున్నారు.దీనిని మీరు కూడా చూసేయండి.