గుజరాత్ రాష్ట్రం, అమరేలి జిల్లా, లాఠీ (Gujarat State, Amareli District, Lathi)మండలంలోని పదర్శింగ గ్రామంలో ఒక విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది.ఈ గ్రామానికి చెందిన సంజయ్ పోలారా అనే రైతు కుటుంబం తమ ‘లక్కీ కారు’కి అద్భుతమైన ‘శవసంస్కారం’ నిర్వహించింది.
అంటే ఈ కారును ఒక మనిషి లాగా భావించి దానికి శాశ్వత విశ్రాంతిని కల్పించడానికి ఒక గొయ్యి తవ్వి అందులో పాతిపెట్టారు ఒక మనిషిని ఖననం చేసినట్లే చాలా ఆచారాలతో దానిని పాతిపెట్టారు.ఈ సంఘటన చుట్టుప్రక్కల ప్రాంతాలలో సంచలనం సృష్టించింది.
ఈ కార్యక్రమానికి సాధువులు, ఆధ్యాత్మిక గురువులు సహా దాదాపు 1500 మంది హాజరయ్యారు.
గత గురువారం జరిగిన ఈ కార్యక్రమం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
వీడియోలో సంజయ్ కుటుంబం తమ పొలంలో విశేషమైన ఆచారాలు చేస్తున్న దృశ్యాలు కనిపించాయి.వారు 12 ఏళ్ల వయసున్న మారుతీ వ్యాగన్ ఆర్ కారును (Maruti Wagon R car)పాతిపెట్టడానికి 15 అడుగుల లోతు గొయ్యి తీశారు.
పాత కారును పాతిపెట్టే(Car Burial) కార్యక్రమం చాలా గొప్పగా జరిగింది.పుష్పాలతో అలంకరించిన వ్యాగన్ ఆర్ కారును సంజయ్ ఇంటి నుంచి వారి పొలం వరకు ఘనంగా తీసుకెళ్లారు.
అక్కడ తవ్విన గొయ్యిలో కారును దించారు.ఆ తర్వాత కారును ఆకుపచ్చని వస్త్రంతో కప్పి, పూజలు చేశారు.
పూజారులు మంత్రాలు చదువుతూ కారుపై గులాబీ రేకులు చల్లి, కారుకు వీడ్కోలు పలికారు.చివరగా, ఎక్స్‌కవేటర్‌తో కారుపై మట్టి వేసి పూడ్చారు.
సూరత్‌లోని నిర్మాణ వ్యాపారం చేస్తున్న సంజయ్ భవిష్యత్తు తరాలు ఈ కారు గురించి గుర్తుంచుకోవడానికి ఇలా చేశానని చెప్పారు.“దాదాపు 12 సంవత్సరాల క్రితం నేను ఈ కారును కొన్నాను.ఇది మా కుటుంబానికి సంపద, గౌరవాన్ని తెచ్చిపెట్టింది.మా వ్యాపారం బాగా జరిగింది.ఈ కారు మాకు చాలా అదృష్టాన్ని తెచ్చింది.కాబట్టి దీన్ని అమ్మే బదులు, నా పొలంలో దీనికి సరైన వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాను” అని అతను మీడియాతో పంచుకున్నారు.ఈ కార్యక్రమం కోసం సంజయ్ దాదాపు రూ.4 లక్షలు ఖర్చు చేశారు.భవిష్యత్తు తరాలు ఈ లక్కీ కారు గురించి గుర్తుంచుకోవడానికి ఆ కారును పాతిపెట్టిన ప్రదేశంలో ఒక చెట్టును నాటాలని కూడా ఆయన నిర్ణయించుకున్నారు.