వేరుశనగలు లేదా పల్లీలు.అంటే ఇష్టపడిని వారుండరు.
పిల్లల నుంచి పెద్దల వరకు దాదాపు అందరూ వేరుశెనగలను ఇష్టంగా తింటుంటారు.రుచి పరంగానే కాదు.
వేరుశనగల్లో పోషకాలు మెండుగానే నిండి ఉంటాయి.ఐరన్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ బి, ప్రోటీన్, ఫైబర్ వంటి ఎన్నో పోషకాలు వేరుశనగల్లో ఉంటాయి.
అవి మన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి.ముఖ్యంగా వేరుశనగలను ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే కీళ్ల నొప్పుల నుంచి వెయిట్ లాస్ వరకు మరెన్నో హెల్త్ బెనిఫిట్స్ ను తమ సొంతం చేసుకోవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం వేరుశనగలను ఎలా తీసుకోవాలో ఓ చూపు చూసేయండి.
ముందుగా ఒక కప్పు వేరుశనగలను తీసుకుని నీటిలో రెండు సార్లు కడగాలి.
ఆ తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.ఇలా నానబెట్టుకున్న వేరుశనగలను చిన్న మంటపై పదిహేను నిమిషాల పాటు ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు మళ్లీ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ నువ్వుల నూనెను వేయాలి.
ఆయిల్ హీట్ అవ్వగానే అందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసి వేయించుకోవాలి.
ఆ వెంటనే అర కప్పు చప్పున ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, ఉడికించిన స్వీట్ కార్న్, టమాటో ముక్కలు వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి.ఆపై అందులో రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు, ఉడికించి పెట్టుకున్న వేరుశెగనలు, రుచికి సరిపడా ఉప్పు, పావు స్పూన్ కారం, కొద్దిగా చాట్ మసాలా, రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం, కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే.
హెల్తీ అండ్ టేస్టీ వేరుశనగల సలాడ్ సిద్ధం అవుతుంది.
ఈ వేరుశనగల సలాడ్ ను మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ సమయంలో తీసుకుంటే.ఆరోగ్యానికి చాలా మంచిది.ముఖ్యంగా వెయిట్ లాస్ అవుతారు.
కీళ్ల నొప్పులు క్రమంగా దూరం అవుతాయి.శరీరానికి అవసరం అయ్యే ప్రోటీన్ లభిస్తుంది.
నీరసం, అలసట దరి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.మెదడు చురుగ్గా పని చేస్తుంది.
గుండె పోటు, క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే రిస్క్ సైతం తగ్గుతుంది.