తెలుగులో ఇటీవలే మొదలైన బిగ్ బాస్ సీజన్ 8 ( Bigg Boss Season 8 )లో ఇప్పటికే 9 వారాలు పూర్తి అయిన విషయం తెలిసిందే.ప్రస్తుతం పదవ వారం నడుస్తోంది.
ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో తెలుగు యాంకర్ విష్ణు ప్రియ ( Anchor Vishnu Priya )కూడా ఒకరు.ఇకపోతే ప్రస్తుతం టాప్ ఫైవ్ లో నిఖిల్ పృథ్వి ప్రేరణ యష్మి, నబీల్ ఉన్న విషయం తెలిసిందే.
ఇది పక్కన పెడితే.బిగ్ బాస్ ఎడిట్ చేసే ప్రోమోలు, ఎపిసోడ్ లు అంతా విష్ణు ప్రియకి ఫేవర్ గాను మిగతావారికి నెగెటివ్ గాను ఉంటున్నాయి.
ఇప్పటి వరకు జరిగిన ఒక్క టాస్క్ లో కూడా గెలవలేదు విష్ణుప్రియ, చెత్త రీజన్స్ తోనామినేషన్ చేసినా, పృథ్వీకి బహిరంగంగా కిస్సులు, హగ్గులు ఇచ్చినా బిగ్ బాస్ తన ఫుల్ సపోర్ట్ ఇచ్చేస్తున్నాడు.దీన్ని బట్టి చూస్తే మన నత్తి బ్రెయిన్ విష్ణు ప్రియని టాప్ 5 కి తెచ్చే ఆలోచనలో బిగ్ బాస్ ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది.నిన్నటి లైవ్ ఎపిసోడ్ లో ఓ వైపు బిగ్ బాస్ టాస్క్ గురించి అనోన్స్ మెంట్ చేస్తుంటే పృథ్వీ వేసుకున్న షూ లేస్ ని కడుతుంది విష్ణుప్రియ.దాంతో బిగ్ బాస్ తనని అలర్ట్ చేసి మళ్ళీ రూల్స్ చెప్తుంటాడు.
లైవ్ లో ఇది ఉంది కానీ ఇది విష్ణు ప్రియని నెగెటివ్ చేస్తోందని భావించిన బిగ్ బాస్ ఎడిటర్ ఆ సీన్ ని లేపేయమన్నాడు.
ఇంకేం ఉంది విష్ణుప్రియని నెగెటివ్ చేసే కంటెంట్ అంతా లేపేస్తున్నారు బిబి టీమ్.ఇక జెన్యున్ గా ఆడే టేస్టీ తేజ, రోహిణి, అవినాష్, నబీల్, ప్రేరణ వారి పరిస్థితి ఏంటో ఇదో షో అని మర్చిపోయి విష్ణుప్రియ ఏం చేసినా కరెక్ట్, అంటు మిగతావారిని తప్పుగా చూపిస్తున్నారు.ఓటింగ్ లో మాత్రం విష్ణుప్రియకి స్ట్రాంగ్ ఉంది.
ఇది నిజమేనా లేక బిబి టీమ్ అంతా కలిసి ఓట్లు వేపిస్తున్నారో చూడాలి మరీ.అయితే బిగ్ బాస్ ప్రేక్షకులు మాత్రం విష్ణు ప్రియా విషయంలో కాస్త కోపంగానే ఉన్నారు.విష్ణు ప్రియ వరస్ట్ కంటెంట్ అంటూ మండిపడుతున్నారు.ప్రేక్షకులతో పాటు బిగ్ బాస్ కూడా విష్ణుప్రియ కు సపోర్ట్ గా నిలుస్తుండగా విష్ణు ప్రియ మాత్రం, పృథ్వితో ప్రేమాయణం నడిపే పనిలో ఉంది.