పుష్ప2 సినిమా బీజీఎం కోసం మరో మ్యూజిక్ డైరెక్టర్.. దేవిశ్రీకు భారీ షాక్ తగిలిందా?

టాలీవుడ్ ఐకాన్ సార్ అల్లు అర్జున్( Allu Arjun ) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం పుష్ప 2( Pushpa 2 ).సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తి అయినట్లు తెలుస్తోంది.

 Thaman For Pushpa 2 Bgm, Thaman, Pushpa 2, Tollywood, Devisri Prasad , Allu Arju-TeluguStop.com

ఈ సినిమా ఈ ఏడాది ఆఖరిలో అనగా డిసెంబర్ 5న విడుదల కానున్నట్లు ఇటీవలే మూవీ మేకర్స్ ప్రకటించారు.విడుదల తేదీకి మరొక ఒక నెల మాత్రమే సమయం ఉండడంతో మూవీ మేకర్స్ ఈ సినిమాను వీలైనంత తొందరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు.

సుకుమార్ ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన క్లైమాక్స్, సాంగ్ ని చిత్రీకరిస్తున్నారట.

Telugu Allu Arjun, Devisri Prasad, Pushpa, Thaman, Tollywood-Movie

పుష్ప 2 పార్ట్ 1ని మించి ఉండబోతోందని తెలుస్తోంది.ఆ సంగతి పక్కన పెడితే.ఇంకో నెల రోజుల కన్నా తక్కువ వ్యవధిలో విడుదల కాబోతున్న పుష్ప 2 ది రూల్ గురించి హఠాత్తుగా వచ్చిన వార్త అభిమానులతో పాటు ఇండస్ట్రీలోనూ కలకలం రేపుతోంది.

దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో తమన్ తో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయించబోతున్నట్టు తెలిసి ఫ్యాన్స్ షాక్ తింటున్నారు.దేవి బీజీఎమ్ పట్ల హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్( Director Sukumar ) ఇద్దరూ అసంతృప్తిగా ఉన్నారనే నేపథ్యంలో మార్పుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

అయితే ఈ విషయం ఇంకా అఫీషియల్ కాలేదు.

Telugu Allu Arjun, Devisri Prasad, Pushpa, Thaman, Tollywood-Movie

నిజానికి పుష్ప 1 ది రైజ్ కు సైతం నేపధ్య సంగీతం విషయంలో నెగటివ్ కామెంట్స్ వచ్చాయి.పాటలు అద్భుతంగా కంపోజ్ చేసినప్పటికీ కొన్ని చోట్ల మినహా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆశించిన స్థాయిలో లేదని రివ్యూలలో సైతం ప్రస్తావించారు.సరే బ్లాక్ బస్టర్ సక్సెస్ లో అదంతా కొట్టుకుపోవడం, ఆ తర్వాత నేషనల్ అవార్డు రావడం జరిగిపోయాయి.

ఇప్పుడు కూడా అదే రిపీట్ అయ్యేలా ఉండటంతో దేవికి బదులు తమన్ వైపు మొగ్గు చూపుతున్నారని తెలిసింది.అజనీష్ లోకనాథ్ పేరు కూడా వినిపిస్తోంది కానీ దానికి సంబంధించిన ధ్రువీకరణ ఇంకా రావాల్సి ఉంది.

మొత్తానికి ఇదో బ్లాస్టింగ్ సెన్సేషన్ అని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube