బిగ్ బాస్ హౌస్ నుంచి గంగవ్వ బయటకు వెళ్లిపోయారా.. ఎలిమినేషన్ కు కారణాలివేనా?

తెలుగు తెలుగులో ఇటీవలే మొదలైన బిగ్బాస్ సీజన్ 8 తెలుగు చూస్తుండగానే అప్పుడే తొమ్మిది వారాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది.ఇప్పుడు పదవ వారం ఎలిమినేషన్స్ కూడా దగ్గర పడుతుంది.

 Gangavva Left In The Middle Week, Gangavva, Bigg Boss Telugu 8, Middle Week, Eli-TeluguStop.com

ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లోకీ గత సీజన్ కంటెస్టెంట్ అయినా గంగవ్వను( Gangavva ) తీసుకు వచ్చిన విషయం తెలిసిందే.అయితే గంగవ్వను తీసుకురావడం పట్ల చాలామంది అసహనం వ్యక్తం చేశారు.

ఆమెకు బదులుగా మరొకరికి హౌస్ లోకి ఎంట్రీ ఇప్పించి ఉంటే వారికి అవకాశం కల్పించినట్టు అయ్యేది అంటూ అభిప్రాయాలు కూడా వ్యక్తం చేశారు.

Telugu Gangavva, Gangavva Middle, Middle-Movie

ఆ విషయం పక్కన పెడితే గత సీజన్ లో హౌస్ లో ఉన్న ఏసీ లు వల్ల ఆమె ఆరోగ్యం దెబ్బ తినడంతో గంగవ్వ ఆ సీజన్ మధ్యలోనే బయటికి వెళ్ళిపోయిన విషయం తెలిసిందే.ఆ తర్వాత బిగ్ బాస్ రెమ్యునరేషన్, నాగార్జున ( Nagarjuna )గారి ఆర్ధిక సహాయంతో గంగవ్వ తన గ్రామంలో చక్కటి ఇల్లు కూడా కట్టుకుంది.ఆ తర్వాత పలు సినిమాల్లో ఫేమస్ అయిన గంగవ్వను బిగ్ బాస్ యాజమాన్యం మరోసారి ఈ సీజన్ 8లోకి వైల్డ్ కార్డు ద్వారా పంపించింది.

గంగవ్వ కూడా ఉత్సాహంతోనే హౌస్ లోకి అడుగుపెట్టింది.ఆమె వయసుకు ఆమె టాస్క్ లు ఏం ఆడుతుంది.

Telugu Gangavva, Gangavva Middle, Middle-Movie

మధ్య మధ్యలో కామెడీ తప్ప.ఇప్పుడు అది కూడా లేదు.టాస్క్ లు ఆడదు, సోది చెబుతుంది అని బుల్లితెర ప్రేక్షకులు కూడా మాట్లాడుకుంటున్నారు.కూర్చుంటుంది, మాటలు చెబుతుంది తప్ప ఉపయోగం లేదు, ఇలాంటి కంటెస్టెంట్ ని అసలు మళ్ళీ హౌస్ లోకి ఎలా తీసుకొచ్చారో, బిగ్ బాస్ ( Big Boss )యాజమాన్యానికి బుర్ర లేదని మాట్లాడుతున్నారు నెటిజెన్స్.

ఇక ఒక కేసు విషయమై గంగవ్వ మద్యలోనే బయటికి వెళుతుంది అన్నారు.కానీ ఇప్పడు ఆమె అనారోగ్య కారణాలతో వీక్ మిడిల్ లోనే బయటికి వచ్చేసినట్లుగా తెలుస్తోంది.

ఇంతకుముందు లాగే ఈ సీజన్ లో కూడా మరొకసారి ఆరోగ్య పరిస్థితిలో బాగో లేకపోవడంతో గంగవ్వ బయటకు వచ్చేసినట్టు తెలుస్తోంది.ఈ విషయంపై ఇప్పుడు మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube