మన చిన్నప్పటినుంచి పుస్తకాలలో తెలుగు సంవత్సరాలు 60.అవి ప్రభవ, విభవ, అంటూ మొదలై చివరికి అక్షయతో పూర్తి అవుతాయి.
ఈ విధంగా తెలుగు సంవత్సరాలు ఉంటాయి.మన తెలుగు క్యాలెండర్ ప్రకారం చైత్ర మాసంలో కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది.
ఈరోజు పండితులు పంచాంగం చదివి ఏడాది మొత్తం ఎవరికీ ఏ విధంగా కలిసి వస్తుందో అనే విషయం గురించి చెబుతుంటారు.అయితే ఈ విధంగా మనకు తెలుగు సంవత్సరాలు 60 ఉన్నాయని, వాటిని క్యాలెండర్ ఆధారంగా మనం తెలుసుకుంటాము.
కానీ మనకు తెలియని 60 సంవత్సరాల కథ ఒకటి పురాణాల్లో దాగి ఉంది.మరి ఆ కథ ఏంటి? 60 సంవత్సరాలు ఎందుకు ఉన్నాయి? అనే విషయాలను తెలుసుకుందాం…
పురాణాల ప్రకారం నారదుడు తన కన్నా గొప్పవాడు ఎవరు లేరని విర్రవీగుతూ ఉంటాడు.ఎలాగైనా నారదుడి పొగరు అని చేయాలని భావించిన విష్ణుమూర్తి ఒక పథకం వేస్తాడు.ఈ క్రమంలోనే నారదుడిని ఒక మాయ ఆవహించి ఒక సరస్సులోకి వెళ్లి స్నానం చేసేలా చేస్తాడు.
నారదుడు ఆ సరస్సులో దిగి స్నానం చేయగానే ఒక స్త్రీ రూపంలోకి మారిపోతాడు.ఈ క్రమంలోనే ఆ సరస్సు వద్దకు వచ్చిన మహారాజును చూసి మోహించి అతడిని వివాహం చేసుకుని 60 మంది పుత్రులకు జన్మనిస్తుంది.

ఈ విధంగా వీరికి ప్రభవ.విభవ.అంటూ పేర్లు పెట్టారు.అయితే వీరందరూ యుద్ధంలో ఒక్కొక్కరుగా మరణిస్తూ నారదుడికి పుత్రశోకం మిగులుతుంది.
ఈక్రమంలోనే నారదుడిని ఆవహించిన మాయను తొలగించి నారదుడికి విష్ణుమూర్తి జ్ఞానోదయం కలిగించాడు.ఈ క్రమంలోనే విష్ణుమూర్తి నారదుడికి వరమిస్తూ మీ పిల్లలు యుద్ధంలో మరణించినప్పటికీ కాలచక్రంలో తిరుగుతూనే ఉంటారని వరం ఇవ్వటం వల్ల మనకు తెలుగులో ఈ 60 సంవత్సరాలు కాలచక్రంలో తిరుగుతున్నాయి.
ఈ విధంగా మనకు 60 తెలుగు సంవత్సరాలు ఉన్నాయి.