ప్రస్తుత రోజులలో ఏ క్షణాన ఏమి జరుగుతుందో ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితులు.ఉద్యోగం కోసం వెళ్ళిన వారు ఇంటికి ఎటువంటి ప్రమాదాలు లేకుండా ఇంటికి వస్తారో రారో కూడా అర్థమవ్వని పరిస్థితులు చాలానే ఉన్నాయి.
ఎక్కువ శాతం రైల్వేలలో, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్స్ లలో పని చేసే వారి పరిస్థితి అయితే మరి దారుణంగా ఉంటుంది.ఒక్కోసారి అనుకోని సంఘటనల వల్ల వారు మృతి చెందిన సంఘటనలు కూడా చాలానే ఉన్నాయి.
అచ్చం అలాంటి సంఘటన ఒకటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో( Uttar Pradesh ) చోటుచేసుకుంది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు కి వెళ్తే.
కాన్పూర్( Kanpur ) దేహత్ జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజ్‌పూర్ పట్టణంలో లైట్స్ అమర్చేందుకు వచ్చిన ఒక లైన్ మాన్( Lineman ) స్తంభం ఎక్కగా.ఈ క్రమంలో విద్యుత్ స్తంభంపై( Electric Pole ) ఉన్న వైర్లు సవరిస్తుండగా ఒక్కసారిగా కరెంటు షాక్ కొట్టడంతో లైన్ మాన్ అక్కడి అక్కడే ఖాళీ బూడిద అయిపోయాడు.ఈ తరుణంలో అకస్మాత్తు కరెంటు సరఫరా అవ్వడంతోనే ఇలా కరెంటు షాక్ జరిగినట్లు తెలుస్తుంది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చక్కరలు కొడుతుంది.
వీడియో చుసిన నెటిజన్స్ వివిధరకాలుగా స్పదింస్తున్నారు.
ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేసే వారి పరిస్థితి ఇలాగే ఉంటుంది అని చాలామంది కామెంట్ చేస్తుంటే.మరి కొందరేమో.ఈ సంఘటన చాలా దురదృష్టకరం అని అతనికి సంతాపం తెలియజేస్తున్నారు.
కేవలం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేసే వారు కాదు.మన ఇంట్లో కూడా ఒక్కొక్కసారి అనుకుని పరిస్థితుల్లో షాక్ గురి అవుతూ ఉంటాము.
కాబట్టి, ఏదైనా కరెంటు సంబంధించిన అవసరాలను చేస్తున్నప్పుడు అతి జాగ్రత్త తీసుకోవడం ఎంతో మంచిది.లేకపోతే ఎలాంటి అనార్థాలకు దారితీస్తుందో చెప్పలేము.