ప్రస్తుత టెక్నాలజీ యుగంలో మనం ఎక్కడ ఏమి జరిగినా కానీ కేవలం ఒక క్లిక్ తో అన్ని తెలుసుకోవచ్చు.ఇలా కేవలం నిమిషాల వ్యవధిలో మనకు కావాల్సిన సమాచారాన్ని తెలుసుకోవడంతో పాటు అనేక నష్టాలు కూడా మనకు కలగవచ్చు.
ప్రస్తుత రోజులలో సైబర్ నేరాలు( Cyber Crimes ) టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ ఫోన్ లు, ల్యాప్టాప్ లు హ్యాక్( Hack ) చేసుకుని ప్రైవసీపరంగా ఇబ్బందులు తలెత్తుతున్న సంఘటనలు మనం రోజు చూస్తూనే ఉన్నాం.సైబర్ నేరగాళ్లు యూజర్ల ఫోన్ స్క్రీన్ సీక్రెట్ గా రికార్డు చేస్తూ బ్యాంకు బ్యాలెన్స్ ఖాళీ చేయడం, పాస్వర్డ్స్ హాక్ చేయడం, ప్రైవేట్ సమాచారాన్ని తో చేయడానికి తెగ ప్రయత్నం చేస్తూ ఉంటారు.
అయితే, ఇలాంటి సమయాలలో మనం పలు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అవి ఏమిటంటే.
మీ ఫోన్ గ్యాలరీలో మీరు మునుపెన్నడూ చూడని విధంగా స్క్రీన్ రికార్డ్స్( Screen Records ) ఏమైనా కనిపించినట్లయితే మీ ఫోన్ హ్యాక్ అయినట్లే అని గుర్తుపెట్టుకోవాలి.అలాగే స్క్రీన్ పై చిన్న గ్రీన్ లైట్స్ కనిపిస్తే మన ఫోను ఎవరో సీక్రెట్ గా రికార్డు చేస్తున్నవచ్చని కూడా తెలుసుకోవచ్చు.సాధారణంగా మన ఫోన్ కెమెరా ఆడియో ద్వారా సైబర్ నేరగాళ్లు సమాచారాన్ని రికార్డు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఒకవేళ మనం మొబైల్ ఫోన్లో మైక్( Phone Mic ) వాడక పైన, అలాగే స్టేటస్ బార్ లో మైక్ సింబల్ కనిపిస్తున్న కానీ ఫోన్ హ్యాక్ కు గురైందని అనుకోవాలి.మెయిన్ గా మనం సెట్టింగ్స్ లలో ఎటువంటి పర్మిషన్స్ ఇవ్వకపోయినా కానీ మైకా ఆన్ అవ్వడం మన వ్యక్తిగత సమాచారం రికార్డ్ అవ్వడం లాంటివి జరిగితే ఖచ్చితంగా సైబర్ నేరగాళ్ల చేతిలో మన ఫోన్ ఉన్నట్లే అని నిపుణులు తెలియజేస్తున్నారు.
అలాగే మనం ఎక్కువ సమయము ఫోను వాడకపోయినా కానీ త్వరగా బ్యాటరీ ఖాళీ అవుతుంది( Battery Drain ) అంటే కూడా ఫోన్ బ్యాగ్రౌండ్ లో ఏదో ఒక సీక్రెట్ యాప్ పని చేస్తుందని అర్థం చేసుకోవాలి.ఇందులో భాగంగా తెలియని యాప్స్ నుంచి నోటిఫికేషన్లు తరచుగా వస్తున్నా కానీ ఫోన్ హ్యాక్ కు గురైనట్లే అని తెలుసుకోవాల్సిందే.అలాంటి సమయంలో మనం అత్యవసరంగా ఉన్న యాప్స్ అన్నిటిని అన్ ఇన్స్టాల్ చేసుకోవడం, అలాగే యాప్స్ పర్మిషన్లు అన్నీ కూడా రివ్యూ చేసుకుంటూ ఉండటం మంచిది.ఒకవేళ ఇలా చేసినా కానీ మన ఫోన్ హ్యాక్ అయినట్లు డౌట్ వస్తే మాత్రం కచ్చితంగా మన స్మార్ట్ ఫోన్ ఫ్యాక్టరీ రీసెట్ చేసుకోవడం మంచిదని టెక్ నిపుణులు అంటున్నారు.