తులసితో తెల్లటి మెరిసే చర్మాన్ని పొందడం ఎలాగో తెలుసా?

హిందువులు తులసి మొక్కను( Basil plant ) లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు.ఇంటి ముందు తులసి మొక్కను నాటి నిత్యం పూజ చేస్తూ ఉంటారు.

 Do You Know How To Get White Glowing Skin With Basil Leaves? White Glowing Skin,-TeluguStop.com

పురాతన కాలం నుంచి ఆయుర్వేద వైద్యంలో తులసిని ఉపయోగిస్తున్నారు.తులసిలో ఎన్నో ఔషధ గుణాలు నిండి ఉండటం వల్ల అనేక జబ్బులను నయం చేయడంలో అద్భుతంగా తోడ్పడుతుంది.

అలాగే చర్మ ఆరోగ్యానికి కూడా తులసి మద్దతు ఇస్తుంది.వివిధ చర్మ సమస్యలకు సమర్థవంతంగా చెక్ పెడుతుంది.

ముఖ్యంగా తులసిని ఇప్పుడు చెప్పబోయే విధంగా వాడితే మచ్చలేని తెల్లటి మెరిసే చర్మం( White glowing skin ) మీ సొంతం అవుతుంది.అందుకోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో నాలుగు కీర దోసకాయ స్లైసెస్( Green cucumber slices ), ఆరు నుంచి ఎనిమిది ఫ్రెష్ తులసి ఆకులు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ చందనం పౌడర్( Sandalwood powder ), వన్ టేబుల్ స్పూన్ ముల్తాని మట్టి( Multani soil ), పావు టీ స్పూన్ ఆర్గానిక్ పసుపు వేసుకోవాలి.

Telugu Basil, Basil Face Pack, Tips, Whiteskin, Glowng Skin, Latest, Skin Care,

అలాగే వన్ టేబుల్ స్పూన్ రోజ్‌ వాటర్( Rose water ) తో పాటు తులసి కీర జ్యూస్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.

వారానికి రెండు సార్లు ఈ విధంగా తులసి మాస్క్ వేసుకుంటే బోలెడు స్కిన్ కేర్ బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.

Telugu Basil, Basil Face Pack, Tips, Whiteskin, Glowng Skin, Latest, Skin Care,

ముఖ్యంగా ఈ రెమెడీ మీ చర్మాన్ని లోతుగా శుభ్రం చేస్తుంది.చర్మ కణాల్లో పెరిగిపోయిన మురికిని తొలగిస్తుంది.చర్మంపై మొండి మచ్చలు ఏమైనా ఉంటే వాటిని క్రమంగా మాయం చేస్తుంది.

అలాగే తులసిలో ఉండే ఔషధ గుణాలు మొటిమలకు చెక్ పెడతాయి.పిగ్మెంటేషన్ సమస్యను దూరం చేస్తాయి.

అంతేకాకుండా ఈ రెమెడీని పాటించడం వల్ల స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవుతుంది.చర్మం తెల్లగా కాంతివంతంగా మెరుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube