వికారం( nausea ).దాదాపు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఈ సమస్యను ఫేస్ చేసి ఉంటారు.
ముఖ్యంగా తిన్నా ఆహారం జీర్ణం కానప్పుడు, జర్నీ సమయంలో వికారం బాగా ఇబ్బంది పెడుతుంటుంది.వికారం వల్ల తిక్క తిక్క గా ప్రవర్తిస్తారు.
మనసు అస్సలు కుదురుండదు.చాలా చిరాగ్గా అనిపిస్తుంది.
కడుపులో తిప్పినట్లు ఉంటుంది.వాంతి చేయాలని కోరిక పుడుతుంది.కానీ వాంతి అవ్వదు.అయితే అలాంటి సమయంలో ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాలను పాటిస్తే వికారం నుంచి క్షణాల్లో రిలీఫ్ పొందుతారు.
వికారంగా అనిపించినప్పుడు దాదాపు ఒక లీటర్ వరకు గోరువెచ్చని నీరు( Warm water ) లేదా నార్మల్ వాటర్ ను తీసుకోవాలి.అలా ఒకేసారి అన్ని నీటిని తాగడం వల్ల కడుపులో ఏమైనా అరగని ఆహారం ఉంటే వాంతి రూపంలో వచ్చేస్తుంది.
దాంతో వికారం నుండి మీరు ఫుల్ రిలీఫ్ పొందుతారు.అలాగే జర్నీ చేస్తున్న సమయంలో వికారంగా అనిపిస్తే పలుపు రుచి కలిగిన చాక్లెట్లను నోట్లో వేసుకొని చప్పరించండి.

అల్లం కూడా వికారాన్ని క్షణాల్లో దూరం చేస్తుంది.అల్లం రసం( Ginger juice ) తాగిన లేదా చిన్న అల్లం ముక్క ను తిన్నా వికారం దూరం అవుతుంది.జర్నీ సమయంలో విండో సీట్ ను ఎంచుకోవాలి.వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి.పూర్తిగా ఏసీ పైనే ఆధారపడకుండా బయట గాలి వచ్చేలా జాగ్రత్తలు తీసుకోవాలి.ఇలా చేయడం వల్ల ట్రావెల్ సమయంలో వికారం ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది.

వికారంతో ఆగమాగం అవుతున్నప్పుడు నిమ్మ రసం, తేనె( Lemon juice , honey ), అల్లం తో హెర్బల్ టీ తయారు చేసుకుని తీసుకోండి.ఇది మీకు చక్కని రిలీఫ్ ను అందిస్తుంది.వికారంగా ఉన్నప్పుడు పుదీనా, నిమ్మకాయ, పెప్పర్‌మింట్ ఆయిల్ వంటివి బాగా హెల్ప్ చేస్తాయి.వీటి వాసన చూస్తే కనుక వికారం నుంచి బయటపడతారు.ఇక ఒక గ్లాసు వాటర్ లో రెండు స్పూన్లు లెమన్ జ్యూస్ కలిపి తీసుకున్న కూడా వికారం పరార్ అవుతుంది.