టాలీవుడ్ ఇండస్ట్రీలో( Tollywood industry ) ఈ మధ్య కాలంలో వరుస ఆఫర్లను సొంతం చేసుకోవడం ద్వారా పాపులర్ అయిన నటులలో షైన్ టామ్ చాకో ఒకరు.తెలుగులో ఈ మధ్య కాలంలో షైన్ టామ్ చాకో ( Shine Tom Chacko )వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
అయితే ఒక నటి ఈ నటుడిపై ఫిర్యాదు చేయడం ఒకింత సంచలనం అవుతోంది.మలయాళ నటి విన్సీ సోని అలోషియస్ ( Malayalam actress Vinci Soni Aloysius )తనతో షైన్ టామ్ చాకో అసభ్యంగా ప్రవర్తించడం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
అతడి పేరు ఎక్కడా రాకూడదని ఫిర్యాదు చేసినప్పుడే పేర్కొన్నానని ఆమె చెప్పుకొచ్చారు.ఆ ఫిర్యాదును తాను వెనక్కు తీసుకుంటున్నానని ఆమె కామెంట్లు చేశారు.ఫిర్యాదు చేసిన సమయంలోనే నటుడి పేరు, ఇతర వివరాలు బయటకు రాకూడదని భావించానని ఆమె చెప్పుకొచ్చారు.ఇప్పుడు వాళ్లు నాకు నమ్మక ద్రోహం చేశారని ఒక నటుడు చేసిన తప్పు వల్ల ఆ చిత్ర బృందం మొత్తంపై ఇప్పుడు ప్రభావం పడుతుందని పేర్కొన్నారు.

ఇలా జరగకూడదని భావించి ఆ నటుడి పేరును ఇంటర్వ్యూలో ఎక్కడా చెప్పలేదని నటి అన్నారు.నాకు ఎదురైన సంఘటన గురించి తెలిసి సినీ రంగానికి చెందిన పలు సంస్థల నుంచి సపోర్ట్ లభించిందని చెప్పుకొచ్చారు.అందుకు ఆనందంగా ఉందని ఆమె తెలిపారు.షైన్ టామ్ చాకో ఎంతో టాలెంటెడ్ అని అతనికి ఆఫర్లు ఇవ్వడంలో తప్పు లేదని ఆమె కామెంట్లు చేశారు.

నేను కోరుకునేది ఒక్కటేనని చేసిన తప్పులను సరిదిద్దుకునే అవకాశం అతడికి ఇద్దాం అని విన్సీ సోనీ తెలిపారు.ఈ ఒక్క సంఘటనతో తాను అధికారులపై నమ్మకం కోల్పోయానని ఆమె చెప్పుకొచ్చారు.సినిమా షూట్ సమయంలో ఒక హీరో డ్రగ్స్ తీసుకుని నాతో అనుచితంగా ప్రవర్తించాడని ఆ షూట్ జరిగినన్ని రోజులు ఎన్నో ఇబ్బందులు పడ్డానని విన్సీ సోని పేర్కొన్నారు.