డియర్ ఉమ మూవీ రివ్యూ అండ్ రేటింగ్!

మామూలుగా తెలుగమ్మాయిలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాణించడం అన్నది కాస్త కష్టమే అని చెప్పాలి.ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్ల కంటే ఎక్కువగా ఇతర హీరోయిన్లు రాణిస్తున్నారు.

 Dear Uma Movie Review And Rating, Dear Uma, Review And Rating, Tollywood, Sumaya-TeluguStop.com

అలా తెలుగులో చాలామందికి అవకాశాలు లేకుండా పోయాయి.ఇకపోతే హీరోయిన్ గా మాత్రమే కాకుండా రచయితగా అలాగే నిర్మాతగా చేసి ఇప్పుడు ఒక కొత్త మూవీతో ప్రేక్షకులను పలకరించింది.

ఆమె మరెవరో కాదు సుమయ రెడ్డి.డియర్ ఉమ(dear uma) సినిమాతో తాజాగా ప్రేక్షకులను పలకరించింది.

ఏప్రిల్ 18న ఈ సినిమా విడుదల అయ్యింది.సుమా చిత్ర ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అన్న వివరాల్లోకి వెళితే.

కథ:

Telugu Dear Uma, Kamal Kamaraj, Prithvi Amber, Review, Sumaya Reddy, Tollywood-M


డాక్టర్ అవ్వాలి అన్న కోరికతో ఉమా (సుమయ రెడ్డి) పల్లెటూరు నుంచి సిటీకి వస్తుంది.ఆయుష్ మెడికల్ కాలేజ్‌ లో జాయిన్ అవుతుంది.మరోవైపు దేవ్ (పృథ్వీ అంబర్)(Prithvi Amber) రాక్ స్టార్ అవ్వాలని ప్రయత్నాలు చేస్తుంటాడు.ప్రేమలో విఫలం అవ్వడంతో తాగుడుకు బానిసై దేని మీదా కాన్సర్టేట్ చేయలేక పోతాడు.

దేవ్ చెడిపోతోన్నాడని ఆగ్రహం వ్యక్తి చేసి అతని తండ్రి ఇంట్లోంచి గెంటేస్తాడు.అక్కడా ఇక్కడా కష్టపడుతున్న దేవ్‌ కి ఒక అమ్మాయిని కాపాడే ప్రయత్నంలో గుండెకు గాయం అవుతుంది.

ఉమ చదువుతున్న ఆయుష్ హాస్పిటల్లోనే దేవ్‌ ని జాయిన్ చేస్తారు.అదే హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్‌ గా ఉమ పనిచేస్తుంది.

అక్కడే దేవ్ అన్నయ్య సూర్య (కమల్ కామరాజ్) కూడా అడ్మినేస్ట్రటర్ కూడా పని చేస్తాడు.అయితే ఆ హాస్పిటల్ నుంచి దేవ్ డిశ్చార్జ్ అయిన తరువాత ఆర్ట్ గ్యాలరీలో పని చేస్తుంటాడు.

ఆ టైంలోనే ఉమతో దేవ్‌ కి పరిచయం ఏర్పడుతుంది.ఉమతో కొన్ని రోజుల ప్రయాణం తర్వాత దేవ్ ఒక నిజాన్ని తెలుసుకుంటాడు.

అసలు దేవ్ తెలుసుకున్న ఆ నిజం ఏమిటి? వీరిద్దరూ కలుసుకున్నారా? చివరికి ఏం జరిగింది.ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

నటీనటుల పనితీరు:

Telugu Dear Uma, Kamal Kamaraj, Prithvi Amber, Review, Sumaya Reddy, Tollywood-M


ఉమ పాత్రలో సుమయ రెడ్డి (Sumaya Reddy)చక్కగా నటించి మెప్పించింది.నిర్మాతగా, రచయితగా, నటిగా సుమయ రెడ్డి తన వంతు న్యాయం చేసిందని చెప్పాలి.అలాగే అందరినీ కదిలించే, అవగాహన కల్పించే, మేల్కొపే కథను రాయడంలో సుమయ సక్సెస్ అయింది.ఎమోషన్స్ పలికించడంలో, తెరపై అందంగా కనిపించడంలోనూ సుమయ రెడ్డి తన మార్క్ ను వేసుకుంది.

హీరోగా పృథ్వీ అంబర్ యాక్షన్, ఎమోషన్ ఇలా అన్ని రకాల ఎమోషన్స్‌ ను పలికించాడు.కమల్ కామరాజ్ (Kamal Kamaraj)యాక్టింగ్ బాగుంటుందని చెప్పాలి.అలాగే ఇందులో అజయ్ ఘోష్ పాత్ర మెప్పిస్తుంది.మిగిలిన నటీనటులు కూడా ఎవరి పాత్రల పరిధి మేరకు వారు బాగానే నటించారు.

విశ్లేషణ:


ఇందులో జరిగిన అన్యాయాలు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తాయి.ఈ సినిమా కథను సాయి రాజేష్ బాగా తెరకెక్కించారు.

ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టేలా ఉంది.సినిమా చూసిన తర్వాత ఒక మంచి సందేశాన్ని అందుకున్నాననే భావన కలిగింది.

తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది.ఇక సుమ చిత్ర ఆర్ట్స్ బ్యానర్ మీద నిర్మాతగా తొలి ప్రాజెక్టునే గొప్పగా నిర్మించి సుమయ రెడ్డి సక్సెస్ అయిందని చెప్పవచ్చు.

సాంకేతికత:

Telugu Dear Uma, Kamal Kamaraj, Prithvi Amber, Review, Sumaya Reddy, Tollywood-M


ఇందులో కెమెరా వర్డ్స్ బాగానే ఉన్నాయి.రధన్ సంగీతం సినిమా భావోద్వేగాలను మరింత పెంచింది.రాజ్ తోట కెమెరా పనితనం చాలా సహజంగా అనిపించింది.అలాగే సినిమా చూస్తున్నంతసేపు ఒక నిజమైన ప్రపంచంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది.స్క్రీన్ ప్లే అయితే అద్భుతం అని చెప్పాలి.ఇంటర్వెల్, క్లైమాక్స్ సీన్స్ నన్ను షాక్‌ కు గురి చేశాయి.

క్లైమాక్స్‌లోని పాట సినిమా యొక్క ముఖ్య ఉద్దేశాన్ని చాలా స్పష్టంగా చెప్పింది.మొత్తంగా చూస్తే మూవీ బాగుంది.

రేటింగ్: 3/5

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube