విటమిన్ సి( Vitamin C ) అనేది ఆరోగ్యానికి మాత్రమే కాదు చర్మ రక్షణకు కూడా ఎంతగానో సహాయపడుతుంది.ఈ కారణంగానే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ లో విటమిన్ సి అనేది భాగమవుతుంది.
అయితే స్కిన్ ను హెల్తీగా, బ్రైట్ గా మార్చే విటమిన్ సి ఫేస్ సీరంను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు.ఆరెంజ్ పీల్, లెమన్ పీల్ మరియు పచ్చి పసుపులో విటమిస్ సి అనేది పుష్కలంగా ఉంటుంది.
వీటితోనే మనం సీరంను ప్రిపేర్ చేసుకోవచ్చు.

అందుకోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో కొన్ని ఆరెంజ్ తొక్కలు( Orange peels ), మరికొన్ని నిమ్మ తొక్కలు, అర టీ స్పూన్ పచ్చి పసుపు కొమ్ము ముక్కలు మరియు నాలుగు టేబుల్ స్పూన్లు రోజ్ వాటర్( Rose water ) వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ జ్యూస్ లో వన్ టీ స్పూన్ గ్లిజరిన్ ( Glycerin )వేసుకొని మిక్స్ చేసుకోవాలి.
ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్( Aloe vera gel ) వేసి మరోసారి బాగా మిక్స్ చేశారంటే మన విటమిన్ సి సీరం అనేది రెడీ అవుతుంది.

ఈ సీరం ను ఒక బాటిల్ లో నింపుకొని ఫ్రిజ్‌లో స్టోర్ చేసుకోవాలి.రోజు నైట్ నిద్రించే ముందు ఈ సీరంను ముఖానికి అప్లై చేసుకుని మసాజ్ చేసుకున్నారంటే అదిరిపోయే బెనిఫిట్స్ మీ సొంతమవుతాయి.ముఖ్యంగా ఈ న్యాచురల్ విటమిన్ సి సీరం మచ్చలు మరియు హైపర్ పిగ్మెంటేషన్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.
చర్మాన్ని కాంతివంతం చేస్తుంది.వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది.
అలాగే ఈ విటమిన్ సి సీరం చర్మాన్ని ఎండ దెబ్బతినకుండా కాపాడుతుంది.మొటిమలతో సంబంధం ఉన్న ఎరుపు మరియు వాపును తగ్గిస్తుంది.
చర్మాన్ని హైడ్రేట్ గా, హెల్తీగా మారుస్తుంది.







