టాలీవుడ్ హీరో ఎన్టీఆర్, కొరటాల శివ (NTR, Koratala Siva)కాంబినేషన్ లో తెరకెక్కిన దేవర (devara)సినిమా విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది.
ఈ సినిమాతో రాజమౌళి (Rajamouli)సెంటిమెంట్ ని బ్రేక్ చేశారు తారక్.పాన్ ఇండియా లెవెల్ లో విడుదల అయిన ఈ సినిమా అన్ని భాషల్లో సక్సెస్ గా నిలిచింది.
ఇకపోతే ఇటీవలే ఈ సినిమాను జపాన్ (Japan)లో విడుదల చేసిన విషయం తెలిసిందే.ఇందుకోసం తారక్ వారం రోజుల ముందే అక్కడికి చేరుకుని పెద్ద ఎత్తున ప్రమోషన్స్ కార్యక్రమాలని కూడా చేపట్టారు.
అయితే ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కూడా సూపర్ హిట్ గా అనిపించింది.జపాన్ దేశంలో కూడా ఈ సినిమా బాగా కలెక్షన్లను సాధించింది.
ఈ సినిమా మంచి హిట్ అవడంతో రెండు రోజులు ఎక్కడ చూసినా హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి.యూఎస్ మార్కెట్ లో రికార్డు వసూళ్లు ఈ చిత్రం అందుకొని అదరగొట్టింది.
ఇక ఈ సెన్సేషనల్ రన్ తర్వాత ఇటీవల జపాన్ దేశంలో కూడా మేకర్స్ ఈ చిత్రాన్ని రిలీజ్ కి తీసుకెళ్లారు.అయితే జపాన్ లో కూడా దేవర మన దగ్గర నడిచినట్టే సాలిడ్ రన్ ని కొనసాగిస్తుంది అని చెప్పాలి.

అక్కడ విజయవంతంగా 3 వారాల రన్ ని కంప్లీట్ చేసుకొని నాలుగో వారంలోకి ఎంటర్ అయ్యింది.దీనితో అక్కడ కూడా దేవర మంచు సక్సెస్ సాధించింది అని చెప్పవచ్చు.ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్(NTR Arts, Yuvasudha Arts) వారు సంయుక్తంగా నిర్మాణం వహించిన విషయం తెలిసిందే.ఇకపోతే ఈ సినిమా జపాన్లో కూడా మంచి విజయం సాధించడంతో మూవీ మేకర్స్ తో పాటు ఎన్టీఆర్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.