బాలీవుడ్ నటి అమృత అరోరా సోదరి, నటి ప్రీతిక రావు (Amrita Arora’s sister, actress Preethika Rao)ఒక నెటిజన్‌పై మండిపడింది.వద్దని అంటున్నా కూడా వినకుండా నటుడు హర్షద్ అరోరాతో(Harshad Arora) కలిసున్న వీడియోను పదేపదే షేర్ చేయడంపై అసహనం వ్యక్తం చేసింది.
ఒకసారి చెప్తే అర్థం కాదా? అంటూ విరుచుకుపడింది.హర్షద్ అరోరా, ప్రతీక రావు(Harshad Arora, Prathika Rao) బెయింటెహా సీరియల్ లో కలిసి నటించచిన విషయం తెలిసిందే.
అయితే అందులోని సీన్లను ఒక అభిమాని ఇన్‌స్టాగ్రామ్‌లో (Instagram)షేర్ చేశాడు.అవి కాస్త ప్రీతికకు నచ్చలేదు.వాటిని తీసేయమని కోరింది.దీంతో సదరు అభిమాని.
పదేళ్ల క్రితం మీరు అతడితో కలిసి నటించినప్పుడు లేని బాధ ఇప్పుడెందుకు? అని ప్రశ్నించాడు.
దాంతో ఆమెకు మరింత పండింది.
అందుకు ఆమె ఓరి నీ తెలివితక్కువ వాడా.నీకేం చెప్పినా అర్థం కాదు.
కొన్ని సన్నివేశాలు సడన్ గా చెప్పి చేయమంటారు.అందుకే నేను టీవీలో(TV) అలాంటి సీన్లలో నటించాను.
అంత మాత్రానికి ఆ సీన్ వీడియోలను పదేపదే షేర్ చేయాల్సిన అవసరం ఏంటి? నిన్ను చూస్తే సిగ్గుగా ఉంది.ఇండస్ట్రీలో కొత్తగా ఎవరొస్తే వారితో పడక పంచుకునే వ్యక్తి తను అలాంటివాడితో కలిసి నటించిన వీడియోలు పోస్ట్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవే నా మనసుకు నచ్చని పని చేస్తున్నావు.

అందుకు కర్మ అనుభవిస్తావ్.బెయింటెహా సీరియల్‌లో 95 శాతం వరకు సాధారణ సీన్లే ఉంటాయి.కేవలం 5 శాతం మాత్రమే ఎక్కువ సాన్నిహిత్యంతో ఉన్న సన్నివేశాలు ఉన్నాయి.నా మాట లెక్క చేయకుండా వాటిని షేర్ చేస్తూనే ఉన్నావ్.ఇంతకింతా అనుభవిస్తావ్ అని శపించింది.ఈ చాటింగ్ కు సంబంధించిన స్క్రీన్‌షాట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కొందరు ఆమెకు మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు.సెలబ్రిటీల విషయంలో వాళ్ల పర్సనల్ విషయాలలో ఎక్కువగా కలగజేసుకోకపోవడమే మంచిది.
ఒకవేళ కడుగ చేసుకుంటే పరిణామాలు ఇలాగే ఉంటాయి అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.