బాన పొట్టతో( Pot Belly ) సతమతం అవుతున్నారా.? శరీరం మొత్తం నాజూగ్గా ఉన్న పొట్ట మాత్రం లావుగా కనిపిస్తుందా.? పొట్ట కొవ్వును కరిగించుకునేందుకు ముప్ప తిప్పలు పడుతున్నారా.? అయితే మీకు కలబంద అద్భుతంగా సహాయపడుతుంది.సౌందర్య సాధనలో కలబందను విరివిరిగా వినియోగిస్తుంటారు.అలాగే జుట్టు సంరక్షణకు కలబంద ఎంతగానో సహాయపడుతుంది.అంతేకాదు ఆరోగ్యానికి సైతం అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది.కలబందలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ దండిగా ఉంటాయి.
మరెన్నో పోషకాలు కూడా కలబందలో ఉంటాయి.
అందుకే ఆరోగ్యపరంగా కలబంద అపారమైన లాభాలను చేకూరుస్తుంది.
ముఖ్యంగా పొట్ట కొవ్వును( Belly Fat ) కరిగించడానికి కలబంద ఉత్తమంగా సహాయపడుతుంది.మరి ఇంతకీ కలబందను( Aloevera ) ఎలా వాడితే బాన పొట్ట మాయం అవుతుందో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక చిన్న కలబంద ఆకును తీసుకుని ఒక ఇంచు పీస్ ను కట్ చేయండి.ఇలా కట్ చేసిన కలబంద ముక్కను వాటర్ లో వేసి శుభ్రంగా కడగండి ఆపై పీల్ తొలగించి లోపల ఉండే జెల్ ను మిక్సీ జార్ లో వేసుకోండి.

అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం తురుము, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, రెండు టేబుల్ స్పూన్ల తేనె, ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి.తద్వారా అలోవెరా జ్యూస్( Aloevera Juice ) సిద్ధం అవుతుంది.ఈ జ్యూస్ మన హెల్త్ కు ఎంతో మేలు చేస్తుంది.రోజుకు ఒక గ్లాస్ చొప్పున ఈ జ్యూస్ ను కనుక తీసుకుంటే పొట్ట వద్ద పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది.