ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగుల భద్రత గురించి కంపెనీలు( Companies ) అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాయి.అగ్నిప్రమాదాలు లాంటివి జరిగినప్పుడు ఏం చేయాలనే దానిపై ఉద్యోగులకు అవగాహన కల్పిస్తూ ఉంటాయి.
అలాగే అగ్నిప్రమాదాలను కట్టడి చేసేందుకు సేఫ్టీ పరికరాలను( Safety devices ) ఆఫీసుల్లో అందుబాటులో ఉంచుతారు.వాటిని ఎలా ఉపయోగించాలనే దానిపై కూడా ఉద్యోగులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ ఉంటారు.
ఇక కొంతమంది ఉద్యోగులు అయితే అత్యంత ప్రమాదకర ప్రదేశాల్లో పనిచేస్తూ ఉంటారు.దీంతో వారికోసం కంపెనీలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ ఉంటాయి.
తాజాగా ఉద్యోగులకు ప్రమాదాల పట్ల అవగాహన కల్పించేందుకు ఒక కంపెనీ వినూత్న ప్రయోగం చేసింది.రేకుల షెడ్( Shed petals ) కింద ఒక ఎరుపు రంగు బాక్స్ పెట్టి దానిపై డు యూ నో హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ సేఫ్టీ అని దానిపై రాశారు.
దాని కింద ఓపెన్ అండ్ సీ అని పచ్చ రంగులో రాసి ఉంది.

కొత్తగా కనిపించడంతో ఒక ఉద్యోగి వెళ్లి బాక్స్ ను ఓపెన్ చేశాడు.అందులో ఉన్నదానిని చూసి షాక్ అయ్యాడు.బాక్స్ లో అద్దం ఉంది.
దీంతో ఉద్యోగి ఒక్కసారిగా షాక్ అయ్యాడు.అద్దం ఎందుకు పెట్టారో కాసేపు అర్ధం కాలేదు.
అయితే ఆ తర్వాత అసలు కారణం తెలిసింది.మీ భద్రతకు మీరే బాధ్యలు అని ఉద్యోగులకు తెలియజేసేందుకు ఆ సంస్థ ఇలా వినూత్న ఆలోచన చేసింది.
అద్దంలో చూసుకుంటే మన శరీరం మనకు కనిపిస్తుంది.దీంతో మీ భద్రతకు మీరే బాధ్యులు అని అర్ధం వచ్చేలా ఈ కొత్త ఆలోచన చేశారు.
ఈ కొత్త కాన్సెప్ట్ బాగుండటంతో ఉద్యోగులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.దీంతో వీడియో వైరల్ గా మారింది.







