మీ కళ్లు ఎపుడైనా ఎరుపు రంగులోకి మారితే ఇదే కారణం అని తెలుసుకోండి!

మనలో అనేకమందికి అప్పుడప్పుడు కళ్ళు ఎర్రబడుతూ ఉంటాయి.పెద్దగా ప్రమాదం లేదు కదా అనుకొని అవాయిడ్ చేస్తూ వుంటారు.

 If Your Eyes Ever Turn Red, This Is The Reason , Eyes, Eyes Problem, Health Prob-TeluguStop.com

కానీ అలా ఈ విషయంలో ఎప్పుడూ నిర్లక్ష్యం వహించరాదు.అవును, ఇపుడు చలికాలం మొదలైంది.

వాతావరణం మారుతున్న క్రమంలో జనాలు రకరకాల ఇన్ఫెక్షన్ల బారిన వాడే అవకాశం లేకపోలేదు.సీజనల్ వ్యాధులు ఐనటువంటి జలుబు, జ్వరం, దగ్గు సహా అనేక సమస్యలు తలెత్తే ప్రమాదం వుంది.

ఇందులో ఒకటి కంటి సమస్య.చాలామందికి ఈ కాలంలో కండ్లకలక లేదా ఎర్రబడుట, పింక్ ఐ సమస్యతో బాధపడుతూ వుంటారు.

ఈ వ్యాధి చాలా అరుదుగా కనిపించినప్పటికీ తేలికగా తీసుకోకూడదు.జరుగుతున్న వాతావరణ మార్పుల కారణంగా ఈ వ్యాధి ప్రజలను బాధిస్తోందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా వాతావరణంలో తేమశాతం పెరిగిందని, దీని వల్ల ఒకరి ఇంటి నుంచి మరొకరి ఇంటికి అంటు వ్యాధులు వేగంగా చేరుతున్నాయి అని ఈ క్రమంలో చెప్పుకొచ్చారు.అటువంటి పరిస్థితిలో కండ్లకలక లేదా కండ్లు ఎర్రబడుట, కంటి ఎరుపు (పింక్ ఐ) సమస్య సాధారణంగా ప్రజలలో కనిపిస్తుందని అంటున్నారు.

Telugu Eyes, Eyes Problem, Problem, Latest-Telugu Health

ఈ సమస్యతో బాధపడుతున్న వ్యక్తి కళ్లు ఎర్రగా మారి బరువుగా అనిపించడం మొదట ప్రారంభమవుతుంది.ఆ తరువాత కళ్లలో వాపుతో పాటు దురద కూడా స్టార్ట్ అవుతుంది.వైద్యుల సలహా ప్రకారం.ఎలాంటి సమయంలో మీ కళ్ళను పదే పదే తాకవద్దు.కళ్ళను నలుపకుండా జాగ్రత్త పడండి.అలాగే నీటితో కళ్లను కడగడం చేయండి.

సమస్య తీవ్రమైతే మాత్రం వెంటనే నిపుణులైన వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.ఎవరికైనా కండ్ల కలక లాంటివి ఉంటే.

అలంటి వారి ఐ కాంటాక్ట్ కి దూరంగా ఉంటే మేలు.దీనిద్వారా సాధ్యమైనంత వరకు ఈ వ్యాధిని నివారించవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube