ఇండస్ట్రీ కి ఎంతో మంది సింగర్స్ లేదా మ్యూజిక్ డైరెక్టర్స్ వస్తూ ఉంటారు.కానీ అందులో మనం ఎంత మందిని నిత్యం గుర్తు చేసుకుంటూ ఉంటాం చెప్పండి.
అలాంటి ఒక గొప్ప సింగర్ కె జె ఏసుదాసు.అస్సలు నీ గొంతు పాడటానికి ఎలా పనికి వస్తుంది అనుకున్నవు అని చాల మంది తొలినాళ్లలో ఆయన్ని తిరస్కరించారు.కానీ తన గొంతు పై తనకు ఎంతో నమ్మకం.ఎలాగైనా సరే పాటలు పాడాల్సిందే అని నిర్ణయించుకొని చెన్నై కి చేరుకొని, అక్కడ కాలి నడకన ఎంతో మంది సంగీత దర్శకుల చుట్టూ ప్రదక్షణలు చేశారు.
ఎక్కడ అవకాశం దొరక్కపోవడం తో స్టేజి పై పాడటం మొదలు పెట్టి సినిమాల్లోనూ ప్రయత్నించారు.

ఆలా చాల కష్ట పడుతుండగా, 1961 లో ఒక మలయాళ సినిమాలో అవకాశం వచ్చింది.అక్కడ నుంచి మొదలయిన ప్రస్థానం గత అరవై ఏళ్లుగా సాగుతూనే ఉంది.పదకొండు భాషల్లో ఇప్పటికి దాదాపు ఎనభై వేల పాటలు పాడిన రికార్డు అయన సొంతం.
కేవలం మన ఇండియాలోనే కాదు అరబిక్, ఆంగ్లం, లాటిన్, రష్యన్ వంటి ఫారెన్ భాషల్లో సైతం పాటలు పాడారు.ఇక తెలుగు నటుడు మోహన్ బాబు కి ఏసుదాసు గొంతు అంటే మహా ఇష్టం.
అయన ప్రతి సినిమాలో ఒక్క పాటైనా పాడించుకునే వాడు.ఒక క్రిస్టియన్ కుటుంబం లో పుట్టిన ఏసుదాసు కి భజన పాటలు పడటం అంటే మహా ఇష్టం.
అయన అయ్యప్ప పై పాడిన పాటలు మంచి ప్రాచుర్యంలోకి వచ్చాయి.

ఒకసారి చర్చి కి ప్రేయర్ కోసం వెళ్లిన ఏసుదాస్ ని అక్కడి స్థానికులు ఎప్పుడు చుసిన భజన పాటలే పాడుతున్నడు అనే సాకుతో చర్చి లోనికి రానివ్వకపోగా వారి మతం నుంచి వెలివేస్తున్నామని చెప్పారు.ఆ తర్వాత మళ్లి కలుపుకున్నట్టు కూడా ప్రకటించారు.పాటలు మతమే కాకుండా నటనలో కూడా ఏసుదాసు కి ప్రవేశం ఉంది.
నాలుగు సినిమాల్లో నటించారు కూడా.తన సంగీత వారసత్వాన్ని ఏసుదాసు కుమారుడు అయినా విజయ్ ముందుకు తీసుకెళ్లాడు.
విజయ్ ఏసుదాసు ఇప్పటికే మూడు వందలకు పైగా సినిమాల్లో పాడి ఎన్నో అవార్డులు కైవసం చేసుకున్నాడు.విజయ్ సైతం తండ్రి వలే నటిస్తున్నాడు కూడా.







