సినిమా రంగంలో ఒక్కో నటుడికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది.కొందరు కామెడీ చేస్తే.
మరికొదరు విలన్ పాత్రలకు మాత్రమే సూట్ అవుతారు.కానీ తెలుగు సినిమా పరిశ్రమలో కొందరు నటులు ఇందుకు మినహాయింపు.
మొదట్లో విలన్ గా పరిచయం అయి.ఆ తర్వాత కమెడియన్లుగా మారిన వారు చాలా మంది ఉన్నారు.ఒకప్పుడు విలనిజంతో భయపెట్టి.ఆ తర్వాత కామెడీతో జనాలను బాగా నవ్వించిన నటులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
కోటా శ్రీనివాసరావు

కోటా శ్రీనివాసరావు.ఒప్పుడు తెలుగు సినిమాల్లో నెంబర్ వన్ విలన్ గా నటించాడు.ఆ తర్వాత నెమ్మదిగా కమెడియన్ గా మారి జనాలను నవ్వించాడు.గణేశ్ సినిమాలో కోటాని క్యారెక్టర్ విలనిజానికి కేరాఫ్ అడ్రస్ గా చెప్పుకోవచ్చు.
ప్రకాశ్ రాజ్ఈయన కూడా కెరీర్ ప్రారంభంలో విలన్ పాత్రలు చేశాడు.ఆ తర్వాత కామెడీతో జనాలకు ఫుల్ ఎంజాయ్ పంచాడు.
జయప్రకాశ్ రెడ్డి

రాయలసీమ ఫ్యాక్షనిస్టుగా రక్తం పారించిన ఈ విలన్ ఆ తర్వాత కామెడీ క్యారెక్టర్లు చేశాడు.విలన్ గా ఎంత గుర్తింపు పొందాడో.కమెడియన్ గా కూడా అందే పేరు సాధించాడు.
ప్రదీప్ రావత్

సై సినిమాతో మొదలైన ఈయన విలనిజం ఆ తర్వాత కాస్త రూపు మారింది.నెమ్మదిగా విలన్ క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చాడు.కామెడీ పాత్రలు చేసి జనాలను ఆకట్టుకున్నాడు.
షియాజీ షిండేఈయన కూడా కెరీర్ మొదట్లో విలన్ గా రాణించాడు.ఆ తర్వాత కామెడీ క్యారెక్టర్లు చేసి చక్కటి గుర్తింపు పొందాడు.
కృష్ణ భగవాన్

ఈయన కమెడియన్ గా పరిచయం అయినా.మొదట్లో నెగెటివ్ రోల్స్ చేశాడు.నెమ్మదిగా టాప్ కమెడియన్ గా ఎదిగాడు.
ఆనంద్ రాజ్ఆయన విలనిజానికి బ్రాండ్ గా మారాడు.
నెమ్మదిగా కామెడీ యాక్టర్ అయ్యాడు.
రఘుబాబుఈయన తొలినాళ్ల నుంచి కామెడీ విలన్ గానే చేశాడు.
విలన్ లక్షణాలున్న కమెడియన్ గా మంచి గుర్తింపు పొందాడు.
అజయ్

భారీ దేహంతో పలు సినిమాల్లో భీభత్సమైన విలన్ గా కనిపించిన అజయ్ నెమ్మదిగా కామెడీ వైపు మళ్లాడు.
సుబ్బరాజు

ఈయన కూడా మొదట్లో నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లు చేశాడు.ఆ తర్వాత కామెడీ పాత్రలు చేసి జనాలను మెప్పించాడు.