ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉండే కత్తి మహేష్.2019 ఎన్నికల సమయంలో.ఏపీ పొలిటికల్ వాతావరణంలో ప్రముఖంగా నిలిచారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసుకుని కత్తి మహేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.ఇదే తరుణంలో ఇటీవల తిరుపతి ఉప ఎన్నికల సమయంలో కూడా కొన్ని సామాజిక వర్గాల దగ్గర కత్తి మహేష్ ప్రచారం చేయడం జరిగింది.
అంతకుముందు బిగ్ బాస్ షోలో కూడా పాల్గొనడం జరిగింది.ఇదిలావుంటే ఇటీవల ఆరు రోజుల క్రితం కత్తి మహేష్ చిత్తూరు జిల్లా నుండి హైదరాబాద్ కి కారులో వెళ్తున్న సమయంలో నెల్లూరు జిల్లాలో రోడ్డుప్రమాదం కి గురైన సంగతి తెలిసిందే.
దీంతో తీవ్రంగా గాయపడిన కత్తి మహేష్ నీ నెల్లూరు ఆసుపత్రిలో జాయిన్ చేయగా పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే ఆయనను చెన్నైకి తరలించారు.చెన్నైలోని అపోలో హాస్పిటల్ లో ప్రస్తుతం కత్తి మహేష్ కి ట్రీట్మెంట్ అందుతూ ఉంది.మొదటిలో కత్తి మహేష్ ఆరోగ్యం.విషమంగా ఉన్నట్టు వార్తలు రాగా తర్వాత.సర్జరీ చేయటంతో అంతా సద్దుమణిగి నట్లు వైద్యులు అదే రీతిలో కత్తి మహేష్ స్నేహితులు తెలియజేశారు.పరిస్థితి ఇలా ఉండగా తాజాగా కత్తి మహేష్ కి జగన్ ప్రభుత్వం హెల్ప్ చేయడం జరిగింది.
విషయంలోకి వెళితే కత్తి మహేష్ ఆరోగ్య వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి జగన్ సహాయనిధి నుండి వైద్య ఖర్చులకు నిధులు మంజూరు చేశారు.దాదాపు 17 లక్షల రూపాయలు.
సీఎం సహాయనిధి నుండి కత్తి మహేష్ కి మంజూరు చేయటంతో కుటుంబ సభ్యులతోపాటు కత్తి మహేష్ స్నేహితులు ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.