బియ్యం.ముఖ్యంగా మన భారతదేశంలో వీటిని విరివిరిగా ఉపయోగిస్తారు.బియ్యంతో రైస్ వండి.ఏదైనా కర్రీ కాంబినేషన్‌తో తింటుంటారు.అయితే బియ్యాన్ని వండే ముందు రెండు, మూడు సార్లు కడుగుతారన్న విషయం తెలిసిందే.అలా కడిగిన నీరును సాధారణంగా ఎవరైనా బయట పారపోస్తారు.
కానీ, అలా చేయడం చాలా పొరపాటు.
ఎందుకంటే.
మన చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేసే గుణాలు ఆ బియ్యం నీటిలో బోలెడన్ని ఉన్నాయి.అవును! వృధాగా పారబోసే ఆ నీటితో అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు.
అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.బియ్యం నీటిలో కాటన్ బాల్ ముంచి ముఖానికి అప్లై చేయాలి.
ఆరిన తర్వాత చల్లటి నీటితో క్లీన్ చేసుకోవాలి.

ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల మీ చర్మం తాజాగా, మృదువుగా మారుతుంది.అలాగే బియ్యం నీరుతో ప్రతిరోజూ ముఖం కడుగుతూ ఉంటే మొటిమలు, మచ్చలు తగ్గుముఖం పడుతాయి.ఇలా చేయడం వల్ల చర్మం మీద దద్దుర్లు, మంటలు వంటి చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి.
అదేవిధంగా, బియ్యం నీటితో కొద్దిగా తేనె కలిపి.ముఖానికి అప్లై చేయాలి.
పావు గంట తర్వాత చల్లటి నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా చేయడం వల్ల చర్మంపై పడిన ముడుతలు తగ్గుతాయి.మరియు చర్మ రంధ్రాలు తగ్గించి చర్మాన్ని బిగుతుగా మారేలా చేస్తుంది.అదేవిధంగా, బియ్యం కడిగిన నీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి పట్టిస్తే.
మృత కణాలు పోవడంతోపాటు చర్మం కాంతివంతంగా మారుతుంది.