సాధారణంగా కొంతమంది హీరోయిన్లు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి సరైన స్టార్ డమ్ సంపాదించడం కోసం ఎన్నో సినిమాలు చేస్తూ ఉంటారు.కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం ఎంట్రీ ఇచ్చిన కొన్ని సినిమాలతోనే తన అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేస్తు ఉంటారు.
అంతే కాదు ఇండస్ట్రీ చూపు మొత్తం తమ వైపు తిప్పుకుంటూ ఉంటారు.ఇక తక్కువ సమయంలోనే వరుస అవకాశాలు అందుకుంటూ బిజీ హీరోయిన్ గా మారిపోతూ ఉంటారూ.
అలాంటి హీరోయిన్ల లో అలనాటి హీరోయిన్ స్మితాపాటిల్ కూడా ఒకరు.
అప్పట్లో అందానికి కేరాఫ్ అడ్రస్ ఆమె.అభినయానికి చిరునామా ఆమె.ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయి నటించగల సత్తా ఆమె సొంతం.ఇక ఆమె నటన చూసి దర్శక నిర్మాతలు ఈ హీరోయిన్ డేట్స్ కోసం వేచి చూస్తూ ఉండేవారు .అంతలా తన నటనతో ఒకసారి గా గుర్తింపు సంపాదించుకుంది స్మితాపాటిల్.దాదాపు అయిదారేళ్ల పాటు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అనే కొనసాగింది.కానీ పెళ్లి తర్వాత మాత్రం క్రమ క్రమంగా చిత్ర పరిశ్రమకు దూరం అవుతూ వచ్చింది. రాజ్ బబ్బర్ తో స్మితాపాటిల్ వివాహం జరిగింది.

కానీ అనుకోకుండా 31 ఏళ్ల కె స్మిత పాటిల్ కన్ను మూసి అందర్నీ దిగ్భ్రాంతికి గురి చేసింది.కానీ ఈ హీరోయిన్ మరణం మాత్రం ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది.ఒక ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ విద్యార్థి.
తమ డిప్లమా కోసం తీసిన ఒక చిన్న చిత్రంతో ఆమె కెరియర్ ప్రారంభమైంది.ఇక రెండు సినిమాలకు జాతీయ అవార్డులను కూడా అందుకున్నారు స్మితాపాటిల్.అయితే ఇక స్మితాపాటిల్ మరణానంతరం కూడా ఓ సినిమా విడుదలైంది.1986లో కొడుకు ప్రతీక్ బబ్బర్ కి జన్మనిచ్చి స్మితాపాటిల్ కన్నుమూశారు.అయితే చనిపోయిన తర్వాత ఆమెను పెళ్లికూతురిగా అలంకరించాలని చివరి కోరిక కోరిందట స్మితాపాటిల్.ఆమె కోరిక మేరకే ఏకంగా పెళ్లి కూతురు ముస్తాబు చేసి ఆమె అంత్యక్రియలు నిర్వహించారు.