ఇదేందయ్యా ఇది: అక్కడ కరోనా కేసుల సంఖ్య పై బెట్టింగ్ ...!

కరోనా పుణ్యమా అని బెట్టింగ్ బంగార్రాజు లకు పనిలేకుండా పోయింది.ఎక్కడ కూడా క్రికెట్ బెట్టింగ్ కానీ, ఏ వ్యాపారాలకు సంబంధించిన కానీ బెట్టింగులు పూర్తిగా నిలిచిపోవడంతో వారు కొత్త ఆలోచనలకు పని పెడుతున్నారు.

 People Now Betting On Covid-19 Cases, Betting On Corona Cases Number, Karnataka-TeluguStop.com

ఇకపోతే తాజాగా బెట్టింగ్ బంగార్రాజు లు ఏకంగా కరోనా వైరస్ మీద బెట్టింగులు కాస్తున్నారు.అసలు ఈ కరోనా పై బెట్టింగ్ ఏంటి అని అనుకుంటున్నారా.? అసలు ఎలా ఈ బెట్టింగ్ కాస్తరని ఆలోచిస్తున్నారా…? వినడానికి ఆశ్చర్యం గా ఉంటే వారు ఈ ఆలోచనతో ఏకంగా వేలల్లో డబ్బులు సంపాదిస్తున్నారు.అలాగే పోగొట్టుకుంటున్నారు కూడా.

అయితే కర్ణాటక రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కొన్ని రోజుల నుండి కరోనా పై పందాలు కాస్తున్నారని పోలీసుల దృష్టికి చేరుకుంది.నిజానికి అటు తెలుగు రాష్ట్రాల్లో అలాగే కర్ణాటక రాష్ట్రంలో కూడా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్న సంగతి తెలిసిందే.

అయితే ఏ రోజుల్లో ఏ ప్రాంతంలో ఎన్ని కరోనా కేసులు వస్తాయని, దానిపై ముందుగానే పందాలు వేసుకుంటున్నారు కొందరు.ఈరోజు విడుదలయ్యే హెల్త్ బులిటెన్ లో 1000 కేసుల లేకపోతే 2000 కేసులా అంటూ బెట్టింగ్ ను కానిచ్చేస్తున్నారు బెట్టింగ్ బంగార్రాజులు.

ప్రస్తుతం ఈ బెట్టింగ్ జోరుగా నడుస్తున్నాయని సమాచారం.


ముందుగా రోజంతా ఈ బెట్టింగులుకు సంబంధించి డబ్బును సేకరించి సాయంత్రం బులిటెన్ విడుదల అయిన తర్వాత వారు పెట్టిన ప్రకారం ఆన్‌లైన్‌ లోనే నగదును ట్రాన్స్ఫర్ చేస్తున్నారని పోలీసుల దృష్టికి వచ్చింది.

అయితే ఇలాంటి బెట్టింగులు కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో, చామరాజనగర్ లాంటి ప్రదేశాలలో… మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో జోరుగా ఉందని సమాచారం.అయితే ఈ బెట్టింగులు తక్కువ మొత్తంలో జరుగుతుండడంతో పోలీసుల దృష్టికి పెద్దగా రాలేదని వారు తెలియజేస్తున్నారు.

ఏది ఏమైనా నా మనవాళ్లు బెట్టింగులకు ఎంత అలవాటుపడిపోయారో వీటి ద్వారా ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube